బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ కు షాక్.. కంటెస్టెంట్‌ అరెస్ట్‌.. ఎందుకంటే?

బిగ్‌బాస్ కన్నడ కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ అయ్యారు. పులి గోరును ఆయన మెడలో వేసుకోవడంతో అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ సెట్స్‌లోకి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్న బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ తో మరింత హాట్ టాపిక్‌ గా మారింది.

New Update
బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ కు షాక్.. కంటెస్టెంట్‌ అరెస్ట్‌.. ఎందుకంటే?

Bigg Boss Kannada Contestant Santhosh Arrest:  బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్‌లో సంచలన ట్విస్ట్ నెలకొంది. కీలక కంటెస్టెంట్‌ వార్తూర్ సంతోష్ అరెస్ట్ అయ్యారు. పులిగోరును ఆయన మెడలో ధరించడంతో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. జంతువుల పరిరక్షణకు పాటుపడుతున్న ఆయనకు పులిగోరు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అటవీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ హీరోయిన్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్‌..!!

బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది. హోస్ట్ కిచ్చ సుదీప్ షోను తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారు.అయితే ఇటీవల మొదలైన సీజన్ 10లో కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  వార్తూర్ సంతోష్ అరెస్ట్ వార్త బిగ్ బాస్ ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా వార్త సినీ వర్గాల్లో కూడా తీవ్ర  చర్చనీయాంశమైంది.

Also Read:  డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్

వార్తూర్ సంతోష్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన వ్యవసాయం చేస్తాడని.. పశువుల సంరక్షణ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా జంతువుల సంరక్షణ విషయంలో తనదైన సేవలు చేస్తు ఉంటాడని తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక హల్లికర్ ఆవుల సంరక్షణకు పాటుపడుతు ఉంటారట. ఆయన హల్లికర్ జాతి ఆవుల సంరక్షణ కమిటీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని సమాచారం.

వార్తూర్ సంతోష్ బిగ్‌బాస్ హౌస్‌లో కన్నడ 10 సీజన్ లో కంటెస్టెంట్‌ గా ఉన్నారు. అయితే, ఆయన పులి గోరును మెడలో ధరించడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు.  చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని వేసుకున్నాడని నిర్ధారించుకొన్నారు. అనంతరం వెంటనే సెట్స్‌లోకి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో అందరి  ఫోకస్  బిగ్‌బాస్ షోపై పడింది. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు. తనకు పులిగోరు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వార్తూర్ సంతోష్ మళ్లీ కేసు నుంచి బయటపడి బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు