Bigg Boss Fame Mehboob: బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్ వివాదంలో పడ్డారు. హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో మెహబూబ్ షేక్ రేవ్ పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. మహబూబ్ బర్త్‌డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారని..బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు పార్టీలో పాల్గొన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా?
అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మెహబూబ్ షేక్‌పై కేసు నమోదు చేశారని సమాచారం. ఆయన తోపాటు పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. పార్టీలో లిక్కర్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .
Also Read: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ!
కాగా, ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. అందులో ముఖ్యంగా సినీ సెలబ్రేటీలు, బుల్లితెర నటులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. అధికారులు ఈ రేవ్ పార్టీలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.