Rave Party: హైదరాబాద్‌లో మరోసారి రేవ్ పార్టీ కలకలం..వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్..! హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్ రేవ్ పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మెహబూబ్ షేక్‌పై కేసు నమోదు చేశారని సమాచారం. By Jyoshna Sappogula 31 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Bigg Boss Fame Mehboob: బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్ వివాదంలో పడ్డారు. హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో మెహబూబ్ షేక్ రేవ్ పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. మహబూబ్ బర్త్‌డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారని..బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు పార్టీలో పాల్గొన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి కారణం మానవ తప్పిదమేనా? అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మెహబూబ్ షేక్‌పై కేసు నమోదు చేశారని సమాచారం. ఆయన తోపాటు పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. పార్టీలో లిక్కర్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . Also Read: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ! కాగా, ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు కలకలం రేపుతున్నాయి. అందులో ముఖ్యంగా సినీ సెలబ్రేటీలు, బుల్లితెర నటులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. అధికారులు ఈ రేవ్ పార్టీలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. #mehboob మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి