Actor Shivaji: SPY బ్యాచ్ పేరుతో సినిమా తీస్తా.. ఎప్పుడో రివీల్ చేసిన శివాజీ

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. బిగ్ బాస్ లో SPY బ్యాచ్ గురించి అడగగా ఆసక్తికర విషయాలు తెలిపారు. SPY పేరుతో ముగ్గురి ఫ్రెండ్ షిప్ పై సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు.

New Update
Actor Shivaji:  SPY బ్యాచ్ పేరుతో సినిమా తీస్తా.. ఎప్పుడో రివీల్ చేసిన శివాజీ

Actor Shivaji: బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో చాలా ఆసక్తికరంగా ముగిసింది. ప్రతీ సీజన్ లో ఉన్నట్లే సీజన్ 7 లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. సీజన్ 5లో SMK గ్రూప్ పేరుతో సన్నీ, మానస్, కాజల్ ఫ్రెండ్ షిప్ బాగా పాపులరైంది. ఇక ఈ సీజన్ లో SPY, (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA(శోభ, ప్రియాంక, అమర్) రెండు గ్రూప్స్ ఉన్నాయి. హౌస్ లో ఈ రెండు బ్యాచ్ ల మధ్య గొడవలు కూడా బాగానే జరిగాయి. ఇక చివరికి SPY బ్యాచ్ నుంచి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే తర్వాత అందరు కంటెస్టెంట్స్ అక్కడక్కడ ఇంటర్వూస్ లో కనిపించారు. కానీ శివాజీ మాత్రం ఎక్కడ ఎక్కువగా కనిపించలేదు.

Also Read: Guntur Kaaram Song : ఇంత రోత పనికిరాదు భయ్యా..”కుర్చీ మడతపెట్టి” ప్రోమో పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

ఇక శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ లో శివాజీ (Shivaji) మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో అనేది తనకు లైఫ్ టైం ఎక్స్ పీరియన్సని.. ఈ షో వల్ల తనకు చాలా ఓపిక వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత శివాజీ ప్రశాంత్ (Pallavi Prashanth) అరెస్ట్ గురించి కూడా స్పందించారు. గ్రాండ్ ఫినాలే తర్వాత కొందరు ఆకతాయిలు చేసిన పనికి తాను బాధితుడు అయ్యాడని.. అందులో ప్రశాంత్ తప్పేమి లేదని అందరికీ తెలుసని చెప్పారు. SPY బ్యాచ్ ఫ్రెండ్ షిప్ సినిమా చేస్తున్నారా..? అని యాంకర్ అడగగా శివాజీ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. హౌస్ లో వాళ్లిద్దరూ తనకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పారు. సినిమా కాదు మా ముగ్గురి బాండింగ్ పై ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టామని చెప్పారు. కానీ అది యు ట్యూబ్ లో వస్తుందా.. లేదా వేరే ప్లాట్ ఫార్మ్ పై వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు శివాజీ.

Also Read: POTTEL Movie: అనన్య నాగళ్ళ ‘పొట్టేలు’.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Advertisment
తాజా కథనాలు