Keerthi Bhat: బిగ్‌బాస్‌ బ్యూటీకి అర్థరాత్రి మెసేజ్.. క్లిక్‌ చేయగానే రూ.2లక్షలు ఫసక్‌.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ సైబర్ నేరగాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ ఆన్ లైన్ లీక్ పై క్లిక్ చేయడంతో లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఈ విషయాన్నీ కీర్తి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. ఇలాంటి మోసాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమని సూచించింది.

New Update
Keerthi Bhat: బిగ్‌బాస్‌ బ్యూటీకి అర్థరాత్రి మెసేజ్.. క్లిక్‌ చేయగానే రూ.2లక్షలు ఫసక్‌.. ఏం జరిగిందంటే?

Keerthi Bhat: మీకు లోన్‌ కావాలా? మీ బ్యాంక్‌ కార్డ్‌పై ఆఫర్‌ను ఈ లింక్‌ క్లిక్ చేసి రీడిమ్‌ చేసుకోండి లాంటి మెసేజీలు వస్తున్నాయా? వాటిని క్లిక్ చేయవద్దు. లింకే కదా అని క్లిక్‌ చేస్తే డబ్బులు మొత్తం గల్లంతే.. మీ జేబుకు పెద్ద సైజు చిల్లు పెట్టేందుకు సైబర్‌ కేటుగాళ్లు కాచుకోని కూర్చుంటారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటిల వరకు ఎవర్నీ వదలరు. ఇలా సైబర్‌ ఫ్రాడ్‌ బారిన పడి వేలు, లక్షలు, కోట్లు పొగొట్టుకున్నవారు కోకొల్లలు .. తాజాగా ఈ లిస్ట్‌లోనే వచ్చి చేరింది ఓ బిగ్‌బాస్‌ బ్యూటీ. అసలేం జరిగింది అనే విషయాన్నీ కీర్తి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియజేసింది.

కీర్తి కామెంట్స్

కీర్తి మాట్లాడుతూ.. "నాకు రావాల్సిన ఒక ముఖ్యమైన ఆర్డర్ వారం రోజులైన రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ కు కాల్ చేశాను. దాంతో వాళ్ళు డెలివరీ చేశామని మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ఆ తర్వాత ట్రాక్  చేస్తే  నిజంగానే అక్కడ ఉన్నట్లు కనిపించింది. నెక్స్ట్ నాకు ఒక కాల్ వచ్చింది.. వాళ్ళు హిందీలో మాట్లాడుతూ.. మీకు ఒక కొరియర్ రావాలి కదా అని అడిగారు. అవును ఇంకా రాలేదు అని చెప్పాను. దాంతో మీ లొకేషన్ అప్డేట్ కావడం లేదు. వాట్సాఫ్‌ ద్వారా మీ లొకేషన్ పంపించండి అని ఒక నెంబర్‌ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసి లొకేషన్ అప్డేట్ కావడం లేదు.. మేము నార్మల్ మెసేజ్ చేస్తాము దానికి రిప్లై ఇవ్వమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే నా మొబైల్ నుంచి హాయ్ అని పెట్టాను. ఆ తర్వాత వెంటనే నాకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ కాపీ చేసి వేరే నెంబర్ కు ఫార్వార్డ్ చేయమని చెప్పడంతో అలాగే చేశాను. ఆ తర్వాత మళ్ళీ ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్ని ఓపెన్ చేయమన్నారు. "

2 రూపాయలు ఎక్స్ ట్రా పే చేయాలి

"అయితే అడ్రెస్ అప్డేట్ కోసం 2 రూపాయలు ఎక్స్ ట్రా పే చేయాలని చెప్పారు. సరే రెండు రూపాయలే కదా అని ఒకే అన్నాను. దానికి యూపీఐ ఐడీ  మెన్షన్ చేయమని చెప్పారు. కానీ నాకు డౌట్ రావడంతో చేయనుని చెప్పాను. ఆ తర్వాత బ్యాంక్‌ అకౌంట్ కు లింకైన నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదేనని చెప్పాను. ఇక కాసేపు అయ్యాక మీకు అప్డేట్ చేస్తామని  కాల్ కట్ చేశారు. కొంత సమయానికి నా అకౌంట్ నుంచి రెండు రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.  రెండు రూపాయలే కదా అని పట్టించుకోలేదు. "

publive-image

అకౌంట్ నుంచి 2 లక్షలు మాయం

" కానీ ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు 99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాలెన్స్ చెక్ చేస్తే 2 లక్షలు కట్ అయినట్లు తెలిసింది. ఇలా జరగడంతో సైబర్‌ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ఇచ్చాను. అకౌంట్ కూడా బ్లాక్చేయించాను. పోలీసులు ట్రాకింగ్ స్టార్ చేశారు. ఖచ్చితంగా నా డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు అంటూ తనకు జరిగిన మోసం గురించి చెప్పికొచ్చింది కీర్తి. అంతే కాదు ఇలాంటి మోసాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమని సూచించింది. "

Also Read: Tillu Square Success Meet: టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్.. వైరలవుతున్న ఫొటోలు.. ఓ లుక్కేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు