Bigg Boss 7 Telugu: అమర్ ఎలిమినేటెడ్..? మళ్ళీ ఒకరు సీక్రెట్ రూమ్..!

ఈ వారం నామినేషన్స్ లో తేజ, అమర్, శోభా, పూజ, యావర్, అశ్విని, నయని పవని ఉండగా.. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఈ వీక్ కూడా మళ్ళీ అమ్మాయిల్లోనే వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బజ్ బాగా వినిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే లిస్ట్ లో శోభా, అశ్విని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

New Update
Bigg Boss 7 Telugu: అమర్ ఎలిమినేటెడ్..? మళ్ళీ ఒకరు సీక్రెట్ రూమ్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో సాగుతోంది. ప్రతి వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు. గత వారంలో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ షోను మరింత ఆసక్తిగా చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, అమర్, శోభా, పూజ, యావర్, అశ్విని, నయని పవని ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఈ వీక్ కూడా మళ్ళీ అమ్మాయిల్లోనే వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బజ్ బాగా వినిపిస్తుంది.

అయితే ఈ సారి ఎలిమినేట్ అయ్యే లిస్ట్ లో శోభా, అశ్విని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆన్లైన్ పోల్స్ లో వోటింగ్ ప్రకారం శోభా, అశ్వినీ ఇద్దరు బాటమ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వీక్ ఎలిమినేషన్ లో మరో ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు వినిపిస్తుంది. అమర్ ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ కి వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు.

publive-image

ఈ వీక్ మొదటి నుంచి అమర్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఇంట్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా అమర్..  నువ్వు గేమ్ సరిగ్గా ఆడటంలేదని నామినేట్ చేశారు. దాంతో అమర్ వీక్ అయిపోయి.. ఈ వారం తనే ఎలిమినేట్ అవుతాడేమోనని భయపడుతున్నట్లు ఎపిసోడ్ లో కనిపించింది.  ఓటింగ్ లో అమర్ టాప్ లోనే ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ ఆటను మరింత ఆసక్తిగా చేయడానికి ఎలిమినేట్ అవుతానని భయపడుతున్న అమర్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కు పంపే అవకాశం ఉందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

శోభా, అశ్విని వీళ్ళిద్దరిలో మాత్రం ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని గట్టిగానే టాక్ నడుస్తుంది. ఈ వారంలో శోభా కెప్టెన్సీ టాస్క్ లో అనవసరంగా గొడవపడటం.. ప్రతి దానికి అరవడం చేస్తుందని ప్రేక్షకులు ఆమె కాస్త నెగిటివిటి తో ఉన్నారు. కొంత మంది శోభా ఎలిమినేట్ అవ్వాలి అన్నట్లుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా వచ్చిన అశ్విని కూడా గేమ్ లో అంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అలాగే తనను శోభా నామినేట్ చేస్తే డిఫెండ్ చేయలేదు కదా, తన చేశారని మొదటి రోజే ఏడుస్తూ ఇక ఈ వారం ఎలిమినేట్ అయిపోతా అన్నట్లుగా మాట్లాడింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కూడా అంతగా ఆడలేకపోయింది. ఇక ఈ వారం శోభా, అశ్విని ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు