Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు. ఈ ఫన్ టాస్క్ కాస్త సీరియస్ అయ్యింది. అమర్, శోభ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఇద్దరు ఒకరి పై ఒకరు గట్టిగా అరుచుకున్నారు.

Bigg Boss 7 Telugu: ఫన్ గేమ్ కాస్త సీరియస్ అయ్యింది.. గొడవ పడిన శోభ, అమర్..!
New Update

Fun Game Became Serious : బిగ్ బాస్ సీజన్.. 7(Bigg Boss 7) ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనికి కోసం ఇంటి సభ్యులు కొన్ని టాస్కుల్లో పాల్గొనాలని తెలిపారు. దీంట్లో భాగంగా బిగ్ బాస్ ఫన్ గేమ్స్ కూడా ఇచ్చారు. అదే విధంగా తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక ఫన్ గేమ్ ఇచ్చారు బిగ్ బాస్.

"Wonder Women" టాస్క్

ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఫన్ గేమ్ "wonder women". ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోయారు. ఈ గేమ్ లో బిగ్ బాస్ ఇచ్చిన వస్తువులను ఉపయోగించి మీ టీమ్ లో ఉన్న అమ్మాయిని "wonder women" గా తయారు చేయాలని చెప్పారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ అమర్ ను సంచాలకుడిగా నిర్మించారు.

publive-image

ప్రియాంక "wonder women"

రెండు టీమ్స్ వాళ్ళ టీమ్ లోని అమ్మాయిలు ప్రియాంక, శోభను అందంగా తయారు చేశారు. ఈ టాస్క్ సంచలకుడైన అమర్ ప్రియాంకను "wonder women" గా అనౌన్స్ చేశాడు. దీంతో శోభకు హర్ట్ అయ్యింది. "నాకు తెలుసు ఇదే జరుగుతుందని" అమర్ నిర్ణయం పై కోప్పడింది. దాంతో అమర్.. "శోభ ఇది ఫన్ గేమ్.. నీకేమైనా పిచ్చి పట్టిందా లైట్ తీసుకో" అంటూ శోభ పై అరిచాడు. ఇక శోభ "నాకు పిచ్చి అని చెప్పకు" అని అమర్ పై సీరియస్ అయ్యింది. ఆ తర్వాత అమర్ మనలో మనకే యునిటీ లేకపోతే ఎలా.. ప్రశాంతత లేకుండా.. ప్రతీ దానికి గొడవలే అంటూ శోభ పై గట్టిగా అరిచాడు.

publive-image

ఇక ఈ ఫన్ టాస్క్ కాస్త సీరియస్ అయినట్లు కనిపించింది ప్రోమోలో. దీని వల్ల అమర్, శోభ, ప్రియాంక మధ్య అభిప్రాయాలు మారే అవకాశం ఉంది. ప్రోమో చివరిలో అమర్ కెమెరాతో మాట్లాడుతూ.. బిగ్ బాస్ మీ "wonder women" టాస్క్ ఏంటో కానీ నాకు 7 వండర్స్ కనిపించాయి అంటూ ఫన్ చేశాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: “వామ్మో మీలా అయితే నటించలేను సార్”.. శివాజీ పై శోభ కామెంట్స్..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #fun-game-became-serious
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe