Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్" టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

New Update
Bigg Boss 7 Telugu: గౌతమ్ కు షాకిచ్చిన శోభ.. ఆ విషయంలో నాకు నచ్చలేదు..!

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా హీరో శ్రీకాంత్, నటి వరలక్ష్మీ "కోట బొమ్మాలి"  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున తో కలిసి స్టేజ్ పై సందడి చేశారు. ఆ తర్వాత నాగార్జున.. సండే ఫన్ డే అంటూ ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు.

ఇక శోభ మైక్ లేకుండా వచ్చేసరికి.. "శోభ మేకప్ వేసుకొని.. మైక్ మర్చిపోయావా" అంటూ శోభను ఆటపట్టించారు నాగార్జున. ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. "యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్ మేట్". నాగార్జున ఇచ్చిన ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు పాల్గొన్నారు.

publive-image

ముందుగా ఈ టాస్క్ ఆడడానికి గౌతమ్ వచ్చాడు. 'ఎవరికీ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇస్తావని నాగార్జున అడగగా.. గౌతమ్ ప్రశాంత్ కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడు. స్టార్టింగ్ లో.. ప్రశాంత్ రివెంజ్ పెట్టుకునేవాడు .. కానీ లాస్ట్ రెండు వారాల నుంచి నార్మల్ అయ్యాడు. నామినేషన్స్ లో కూడా నార్మల్ గా ఉంటున్నాడు అందుకని ప్రశాంత్ కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇస్తున్నానని చెప్పాడు. ఇక అమర్ కూడా ప్రశాంత్ కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడు.

publive-image

ఆ తర్వాత వచ్చిన శోభ.. గౌతమ్ ని బ్లాక్ చేస్తానని చెప్పి మొహం స్టాంప్ వేసింది. దానికి శోభ చెప్పిన కారణం.. ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో..  "ప్రియాంక కెప్టెన్ అవ్వడం నీకు ఇష్టం లేదా.. ఇష్టం లేదని నీ నోటితో చెప్పు.. నేను అమర్ టవర్ ను కొట్టడం ఆపేస్తా అని చెప్పడం నాకు నచ్చలేదు" అని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన అశ్విని కూడా.. "అమర్ ను కెప్టెన్సీ టాస్క్ లో గౌతమ్ టార్గెట్ చేయడం నచ్చలేదని" గౌతమ్ మొహం పై స్టాంప్ వేసింది. ఇక శివాజీ అర్జున్ కు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఇచ్చాడు. "వచ్చినప్పటి నుంచి అర్జున్ చాలా ఫెయిర్ గా అనిపించాడు" అని చెప్పాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: యావర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..? షాక్ లో ఇంటి సభ్యులు..!

Advertisment
తాజా కథనాలు