Bigg Boss 7 Telugu: శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? ఎలిమినేషన్ వెనక కారణం..?

బిగ్ బాస్ సీజన్ 7 లో మరో కొత్త ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివాజీ , శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేశారు అంటూ ప్రేక్షకులలో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. అసలు శివాజీ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా ..

New Update
Bigg Boss 7 Telugu:  శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? ఎలిమినేషన్ వెనక కారణం..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో గత సీజన్స్ లో ఎప్పుడూ జరగనట్లు కొత్త కొత్త ట్విస్ట్ లు ఇస్తూ ఇటు ప్రేక్షకులను అటు హౌస్ మేట్స్ ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు బిగ్ బాస్. ఇక ఈరోజు ప్రోమోలో బిగ్ బాస్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అంటూ మరో కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గేట్లు ఓపెన్ చేయగానే శివాజీ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. దాంతో ఇంటి సభ్యులంతా షాక్ అవుతారు. అసలు శివాజీ బయటకి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది.. శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా, లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా.. అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read: Allu Arjun - అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!

గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ శివాజీ చేతికి గాయం అయ్యింది. దాంతో శివాజీ తన చెయ్యి పైకి లేపలేకపోతున్నాడు అలాగే తనకు బ్యాక్ పెయిన్ కూడా ఉందంటూ చెప్పాడు. కావున ఆయన ఆరోగ్య రిత్యా శివాజీ ని ఇంటి నుంచి బయటకు పంపుతున్నారేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నారు

publive-image

ఇది బిగ్ బాస్ ప్లాన్ కూడా అవ్వచ్చు అని మరి కొంత మంది అనుకుంటున్నారు. ఎందుకంటే శివాజీని సీక్రెట్ రూమ్ కి పంపి గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తారేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఒకవేళ శివాజీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం నిజం అయితే మళ్ళీ ఎవరైనా రీ ఎంట్రీ అవ్వబోతున్నారు అనే డౌట్ కూడా ప్రేక్షకులలో ఉన్నట్లు తెలుస్తుంది.

publive-image

Also Read: ఆ స్టార్ ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీవెడ్డింగ్ పార్టీ..సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!!

శివాజీ బయటకు వెళ్లడంతో రైతు బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటి సభ్యులందరు చాలా బాధపడతారు. శివాజీ తిరిగి ఇంట్లోకి వస్తాడా లేదా పెర్మనెంట్ గా వెళ్ళిపోయాడు అంటూ ప్రేక్షకులలో ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు బిగ్ బాస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు