Bigg Boss 7 Telugu: గత వారంలో శుభ శ్రీ, రతిక, దామిని ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి ఇంటి సభ్యులు ఓటింగ్ కూడా చేశారు. ఓటింగ్ పూర్తి అయ్యాక బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి వాళ్ళ ముగ్గురిలో ఎక్కువ ఓటింగ్ వచ్చిన వారు కాకుండా, ఎవరికైతే తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు రీ ఎంట్రీ ఇస్తారు అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళే లోపలికి వస్తారు అనే దాని వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏమై ఉంటుందని ప్రేక్షకుల నుంచి పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే బజ్ గట్టిగానే నడుస్తుంది.కానీ ఇంటి సభ్యులలో చాలా మంది రతిక కు ఓట్ చేసే అవకాశం తక్కువ ఎందుకంటే ఇంట్లో ఉన్న సభ్యులకు రతిక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ ఉండేది కాబట్టి తను మళ్ళీ వస్తే కాంపిటీషన్ అనుకోని కూడా కొంత మంది ఓట్ వేసి ఉండరు. అలాగే రతిక కొన్ని విషయాల్లో ఎవరి మాట వినకుండా మొండిగా తాను అనుకున్నదే చేసేది ఆ విషయం కూడా ఇంటి సభ్యులకు నచ్చేది కాదు. అందుకని రతిక కు తక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని ప్రేక్షకులు భావించారు. దాంతో అందరితో మంచిగా ఉన్న శుభ శ్రీ రీ ఎంట్రీ ఇవ్వచ్చు అనే వార్తలు వినిపించాయి.
కానీ తక్కువ ఓట్లు వచ్చిన వారే ఇంట్లోకి వస్తారని బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ తో, తక్కువ ఓట్లు పడతాయని భావించిన రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీని వెనుక బిగ్ బాస్ పెద్ద ప్లాన్ ఏ వేసినట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇంటి సభ్యుల ప్రకారం ఓట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు వస్తే, వచ్చిన వాళ్ళు హౌస్ మేట్స్ తో వాళ్ళకు ఓట్ చేశారని వాళ్ళతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు రతిక ఇంట్లోకి వస్తే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది.
ఎందుకంటే ప్రశాంత్, రతిక మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు మళ్ళీ రతిక రీ ఎంట్రీ ఇస్తే ఇంతక ముందులాగే ప్రశాంత్ తో నెగిటివ్ గా ఉంటుందా లేదా ప్రశాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అతనితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తుందా అనే విషయం పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారు. అందుకని బిగ్ బాస్ రతికను రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.