Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చేది తనే.. పెద్ద షాకిచ్చిన ఇంటి సభ్యులు..!

బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ  నాగార్జున ఇంటి సబ్యులకు పెద్ద  షాక్ ఇచ్చాడు.  ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ అనే విషయం పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

New Update
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చేది తనే.. పెద్ద షాకిచ్చిన ఇంటి సభ్యులు..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ  నాగార్జున ఇంటి సభ్యులకు పెద్ద  షాక్ ఇచ్చాడు.

ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ అనే విషయం పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. చాలా వరకు రతిక రీ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. రతిక రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి.. మొదట్లో తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ప్రశాంత్ పట్ల తను ప్రవర్తించిన తీరు ప్రేక్షకులలో విపరీతమైన నెగిటివిటీని తీసుకురావడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ  ప్రస్తుతం ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ రతిక బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు తనను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన విషయం తెలిసిందే.. అలాగే నిన్న తను చేసిన ఓట్ అప్పీల్ కూడా తన తప్పులను తెలుసుకున్నట్లు తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ చాలా నిజాయితీగా తన తప్పులను ఒప్పుకుంది దాని వల్ల ఇంటి సభ్యులకు తన పై అభిప్రాయం మారి తనకు ఎక్కువ ఓట్ చేసే అవకాశం ఉంది.

రతిక తర్వాత శుభ శ్రీ కూడా వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఇంట్లో శుభ శ్రీ ఉన్న 4 వారాలలో ఎవరితో పెద్దగా గొడవలు పడకుండా, అందరితో కలిసిపోయే చాలా సేఫ్ గా గేమ్ ప్లే చేసింది.  శుభ శ్రీ టాస్క్ లో అంత స్ట్రాంగ్ కానప్పటికీ తన పై ఉన్న మంచి అభిప్రాయంతో హౌస్ మేట్స్ ఓట్ చేసి తనకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఇక దామిని వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రతిక, శుభ శ్రీ వీళ్ళిద్దరిలో ఒకరు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి బిగ్ బాస్ ముగ్గురి రీ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు అనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

Also Read: Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. ‘భగవంత్’ కేసరి టీం సందడి

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Advertisment
తాజా కథనాలు