Bigg Boss 7 Promo: నా వల్ల కావడం లేదు.. గుండె బరువుగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమోలో శివాజీ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గత వారం నుంచి శివాజీ చెయ్యి నొప్పితో భాదపడుతున్న విషయం తెలిసిందే. ప్రోమోలో బిగ్ బాస్ శివాజీని పిలిచి మీ చెయ్యి ఎలా ఉంది అని అడగగా శివాజీ.. " చెయ్యి బాగా లాగుతుంది చాలా ఇబ్బందిగా ఉంది, నా వల్ల కావడం లేదు .. అందరి ముందు ఏడవలేక.. నవ్వుతూ ఉంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు".

New Update
Bigg Boss 7 Promo: నా వల్ల కావడం లేదు.. గుండె బరువుగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ..!

Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో ఇంటి సభ్యలందరు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. కెప్టెన్సీ ఫైనల్ లెవెల్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'ఫ్లోట్ ఆర్ సింక్' ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి  కెప్టెన్సీ కి అనర్హులుగా భావించిన ఇంటి సభ్యుల ఫోటోలను స్విమ్మింగ్ పూల్ లో వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. అలా చివరిగా ఎవరి ఫోటో అయితే స్విమ్మింగ్ పూల్ లో పడకుండా ఉంటుందో వారు కెప్టెన్ గా నిలుస్తారని తెలిపారు.

publive-image

శివాజీ అవుట్ ఆఫ్ ది రేస్

కెప్టెన్సీ టాస్క్ ప్రక్రియలో భాగంగా అమర్ శివాజీ ఫోటోను స్విమ్మింగ్ పూల్ వేశాడు. దాంతో శివాజీ 'నేను కెప్టెన్ గా ఎందుకు అర్హుడిని కాదు' అంటూ అమర్ తో ఆర్గుమెంట్ చేశాడు. దానికి అమర్.. మీరు ముందు ఉండి టీం లీడ్ చేశారు అన్నా నేను ఒప్పుకుంటాను  మీ కన్నా కష్టపడి చాలా మంది ఆడారు వాళ్ళకు ఒక చాన్స్ రావాలి.. ఆ ఒక్క ఉద్దేశంతోనే మిమల్ని అనర్హులుగా చెప్పానని అంటాడు. కానీ శివాజీ మాత్రం అమర్ నిర్ణయంతో కాస్త అసంతృప్తి గానే ఉన్నట్లు ప్రోమోలో కనిపించింది.

కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ 

దాని తర్వాత బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. గత వారం నుంచి శివాజీ చెయ్యి నొప్పితో భాదపడుతున్న విషయం తెలిసిందే. ఇక  ప్రోమోలో బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి.. శివాజీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు దాంతో శివాజీ "చాలా ఇబ్బందిగా ఉంది, నా వల్ల అస్సలు కావటం లేదు చెయ్యి బాగా లాగుతుంది" అని చెప్పాడు. అంతే కాదు అందరి ముందు ఏడవలేక.. నవ్వుతూ లోపల ఏడుస్తున్నాను, గుండె అంతా బరువుగా ఉంది బిగ్ బాస్ అంటూ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక కెప్టెన్సీ  రేస్ లో చివరి వరకు మిగిలింది ఎవరు.. ఫైనల్ గా కెప్టెన్ అయ్యింది ఎవరు అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు