/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-81-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇంటి సభ్యులకు కెప్టెన్సీ లో భాగంగా బిగ్ బాస్ పలు ఛాలెంజెస్ ఇచ్చారు. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమోలో మొదటి ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ 'జంపింగ్ జపాంగ్' ఈ టాస్క్ లో అవతలి టీం పై గెలవాలంటే.. వీలైనన్ని ఎక్కువ.. మీ టీం కలర్ బెలూన్స్ ఊదీ అక్కడ ఉన్న టైర్ లో ఫిట్ చేయాలనీ ఆదేశించారు.
యావర్ పై అరిచేసిన ప్రియాంక
ఇక ఈ టాస్క్ లో ఇరు టీమ్స్ పోటా పోటీగా బెలూన్స్ ఊది టైర్ లో ఫిట్ చేయడానికి ప్రయత్నించారు. టాస్క్ మధ్యలో యావర్ టైర్ మధ్యలో బెలూన్ పెట్టి మళ్ళీ తీసే ప్రయత్నం చేశాడు. దాంతో ప్రియాంక అలా తీసి పెట్టకూడదు అంటూ యావర్ పై గట్టిగా అరిచేసింది.
గేమ్ లో డెడ్ అయిన ప్రశాంత్
ఆ తర్వాత బిగ్ బాస్ ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ లో ఛాలెంజ్ గెలిచిన సభ్యులు అవతలి టీం నుంచి ఒక సభ్యున్నీ ఆటలో నుంచి పూర్తిగా తొలగించి.. వారి మెడలో డెడ్ బోర్డు వేయాలని రాసి పంపారు బిగ్ బాస్. ఇక గెలిచిన సభ్యులైన గౌతమ్, శోభ, యావర్, భోలే, తేజ, రతిక అవతలి టీంలోని ప్రశాంత్ ని ఆటలో నుంచి తొలగించాలని నిర్ణయించి.. ప్రశాంత్ మెడలో డెడ్ బోర్డు వేశారు.
దమ్ముంటే నన్ను తీయాల్సిందిరా..
ఆటలో నుంచి తొలగిపోయిన ప్రశాంత్ భాదతో ఏడ్చినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. దమ్ముంటే గేమ్ లో నుంచి నన్ను తీయాల్సిందిరా.. వాన్ని కాదు అంటూ కాస్త ఫైర్ అయినట్లుగా కనిపించాడు ప్రోమోలో. ఇక గౌతమ్ మాట్లాడుతూ.. ఇది మా టీం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం.. ఇది ఆటలో భాగం మాత్రమే.. మాకు అనిపించింది చేయడం కూడా తప్పేనా అంటూ ఆరోపించాడు. ఇక ప్రశాంత్ విషయంలో అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్ గేమ్ బాగా ఆడతాడు ఆ కుళ్ళుతోనే వాడిని గేమ్ లో నుంచి తీసేశారని భోలేతో చెబుతూ ఉంది.
Also Read: Bigg Boss 7 Telugu Promo: గౌతమ్ నా బ్యాగ్ లాగేశాడు.. రతిక డబుల్ గేమ్..!