Bigg Boss 7 Telugu Promo: నీకు తెలుగు అర్థమవుతుందా.. ఎందుకొచ్చావు మరీ..!

బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో అశ్విని, యావర్ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక అశ్విని..నన్ను ఆడపిల్లను చేసి ఆడుకుంటున్నావు ..అంటూ యావర్ తో వాదిస్తున్నట్లుగా ప్రోమోలో కనిపించింది.

New Update
Bigg Boss 7 Telugu Promo: నీకు తెలుగు అర్థమవుతుందా.. ఎందుకొచ్చావు మరీ..!

Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమో చూస్తుంటే నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నట్లుగా కనిపించింది. నామినేషన్ ప్రక్రియలో  హౌస్ మేట్స్ పలు కారణాలు చెబుతూ.. ఇతర ఇంటి సభ్యులను నామినేట్  చేశారు.  ఇక ఇతరులు చెప్పే రీజన్స్ నచ్చని ఇంటి సభ్యులు వాళ్ళతో వాదించడం మొదలు పెట్టారు.

publive-image

ప్రోమోలో గౌతమ్.. రతికను నామినేట్ చేస్తూ.. ఇంట్లో అందరితో కలుస్తున్నట్లు అనిపించడం లేదు.. కేవలం ఒకరితోనే ఉన్నట్లుగా అనిపించింది. అంతే కాదు లాస్ట్ వీక్  టాస్క్ లో కూడా  అంతగా ఆడినట్లు కనిపించలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత అమర్ ను నామినేట్ చేశాడు. అమర్ ను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ టాస్క్ లో సంచాలకుడిగా ఉన్న నన్ను కూడా మ్యానుపిలేట్ చేసి ఫౌల్ గేమ్ ఆడావు అది నాకు నచ్చలేదని చెప్పాడు.

ఇక అశ్విని, యావర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అశ్విని యావర్ ని నామినేట్ చేసింది. నామినేషన్ ప్రక్రియలో అశ్విని మాట్లాడుతూ.. అసలు నీకు తెలుగు అర్ధం అవుతుందా.. అర్థం కాకపోతే ఎందుకొచ్చావు మరీ అంటూ ప్రశ్నించింది. దానికి యావర్ నన్ను 'ఎందుకొచ్చావు' అని అనడం కరెక్టా.. అంటూ అశ్వినితో వాదించాడు. ఆ తర్వాత అశ్విని.. నన్ను ఆడపిల్లను చేసి ఆడుకుంటున్నావు.. అది నాకు అర్థం అవుతుందని కోపంగా మాట్లాడింది.

publive-image

వీరిద్దరి మధ్య చాలా సేపు  వాదనలు జరిగినట్లుగా  ప్రోమోలో కనిపించింది. చివరిలో అశ్విని.. అసలు నా నామినేషన్ లిస్ట్ లో నువ్వు లేవు.. నా దృష్టిలో వేరే వాళ్ళు ఉన్నారు. కానీ  నాకు వ్యాలిడ్ రీజన్ లేకుండా నువ్వు నామినేషన్ వేశావు.  అందుకే ఇప్పుడు నిన్ను నామినేట్ చేశానని యావర్ తో చెప్పింది. దానికి యావర్ మాట్లాడుతూ..  అయితే  నాకు రివెంజ్ నామినేషన్ వేశావు అంతే కదా.. అంటూ అశ్వినితో వాదించాడు.

publive-image

Also Read: Renu Desai: వరుణ్ వివాహానికి ఆహ్వానం.. రేణు దేశాయ్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు