Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ప్రతి వారంలానే ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

New Update
Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 మండే నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.  ప్రోమోలో హౌస్ మేట్స్ అందరు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ వారం బిగ్ బాస్ బాస్ ఇంటి సభ్యులకు.. ఇంట్లో ఉండటానికి ఎవరికి అర్హతలేదని ఎవరిని భావిస్తారో వారిని నామినేట్ చేయాలని ఆదేశించారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య  వాదనలు  జరిగాయి

publive-image

ఓడిపోయిన నీకే అంత బాధగా ఉంటే.. గెలిచిన నాకు..

ఇక ప్రశాంత్ అమర్ ని నామినేట్ చేస్తూ.. టాస్క్ లో ఓడిపోయిన నీకే అంత బాధగా ఉంటే.. గెలిచిన నాకు ఎలా ఉంటుంది అని అన్నాడు. గత వారంలో అమర్ ప్రశాంత్ ని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించాడు.. దాని కోసమే ప్రశాంత్ అమర్ ను నామినేట్ చేసినట్లు కనిపించింది. దీనికి అమర్ స్పందిస్తూ.. నాకంటూ అవకాశం వస్తే ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళను మళ్ళీ అవ్వనివ్వను మరొకరికి అవకాశం ఇస్తానుని చెప్పాడు. దీంతో ప్రశాంత్ ఒక సారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదని రూల్ ఉందా అంటూ అమర్ తో వాదించాడు.

publive-image

లాస్ట్ వీక్ నీ ఆట ఎందుకు చూపించాలి 

ప్రియాంక, రతిక ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగినట్లు ప్రోమోలో  కనిపించింది. ప్రియాంక రతికను నామినేట్ చేస్తూ.. నాగ్ సార్ తో నెక్స్ట్ వీక్ నుంచి నా గేమ్ చూపిస్తా అన్నావు.. మరి లాస్ట్ వీక్ నీ ఆట ఎందుకు చూపించలేదు అంటూ నామినేట్ చేసింది. దీనికి రతిక.. లాస్ట్ వీక్ కాదు.. ఈ వారం నా గేమ్ చూశాక ఈ మాట చెప్తే బాగుండేదని మాట్లాడింది.

publive-image

ఓటు వేయలే.. పోటేసిన

ఇక భోలే, ప్రియాంక ప్రతి వారంలానే ఈ వారం కూడా నామినేషన్ లో వాళ్ళ వాదనలు మొదలు పెట్టారు.  ప్రియాంక భోలేను నామినేట్ చేసింది. దానికి ప్రియాంక చెప్పిన రీజన్.. నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించడానికి ఎందుకు ఓట్ చేశారో.. కారణం చెప్పండి అంటుంది. దానికి భోలే నేను నీకు ఓట్ వేయలే.. పోటేసిన అని ప్రియాంకకు కౌంటర్ ఇచ్చాడు. ఇక వీళ్లిద్దరి మధ్య వాదన సాగుతూనే ఉంది. చివరిలో భోలే నువ్వు ఎంత చెప్పినా అర్థం చేసుకోవు అందుకే ఆ రోజు.. నీ మెడలో మిరపకాయల దండ వేసిన.. అంతే అంటూ ప్రియాంకకు రిప్లై ఇచ్చాడు.

publive-image

అర్జున్ VS శోభ 

ఆ తర్వాత ఊహించని విధంగా అర్జున్.. శోభను నామినేట్ చేశాడు. ఈ నామినేషన్ లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.  ముందు నుంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఈ నామినేషన్ తో కాస్త దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. publive-image

Also Read: Bigg Boss 7 Telugu: నా వల్లే ఎలిమినేట్ అయ్యాడు.. సందీప్ ఎలిమినేషన్ కు తనే కారణం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు