/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-96-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ లోని సెకండ్ ప్రోమో కూడా విడుదలైంది. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగార్జున ఇంటి సభ్యులకు ఏదో ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇవ్వడం మాత్రమే కాదు.. దాంట్లో ఏదో ఒక మెలిక పెట్టి ఇంటి సభ్యుల మధ్య బాగానే ఫిట్టింగ్ పెడతారు. ఇక ఈరోజు ప్రోమోలో నాగార్జున హౌస్ మేట్స్ కు ఇచ్చిన టాస్క్.. ఒక సామెత తీసుకొని..ఇంట్లో అది ఎవరికి సరిపోతుందో వారి మెడలో వేయమని తెలిపారు.
ఈ టాస్క్ ఆడడానికి ముందుగా భోలేను పిలిచారు నాగార్జున. ఇక భోలే 'కుక్క తోక వంకర' అనే సామెతను అమర్ మెడలో వేసి.. నాకు ఆటల్లో నచ్చుతాడు కానీ ఎన్ని సార్లు చెప్పిన తన ప్రవర్తన మారలేదు అన్నట్లుగా చెప్పాడు.
ఆ తర్వాత వచ్చిన అమర్.. 'గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన' సామెతను అశ్విని మెడలో వేసి.. తాను తీసుకున్న నిర్ణయం పై క్లారీటీ ఉండదు.. అటూ, ఇటూ మారుస్తుందని చెప్పాడు. దానికి అశ్విని 'నా గేమ్ అది' అంటూ అమర్ కు రిప్లై ఇచ్చింది.
ఇక ప్రశాంత్ మెడలో 'ఏకు లా వచ్చి మేకులా తగులుకున్నాడు' అనే సామెత ఉన్న బోర్డును వేశాడు అర్జున్. అందుకు నాగార్జున ఏలా..? అని అడగగా .. ప్రశాంత్ వచ్చిన మొదట్లో 'ఏమీ ఆడలేడు అనుకున్నాము.. కానీ ఇంత బాగా ఆడతాడని ఎవ్వరూ ఊహించలేదని చెప్పాడు.
ప్రశాంత్ వచ్చి తేజ మెడలో 'ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది' అనే సామెతను వేసి.. శోభ, తేజ అక్కడ విషయమేమి లేకపోయినా అనవసరంగా వాదన చేస్తుంటారని చెప్పాడు. ఆ తర్వాత ప్రియాంక వచ్చి అశ్విని మెడలో 'నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' అనే సామెతను వేసి.. ఏదో మాట్లాడుతుంది మళ్ళీ అనలేదు అంటూ వాదిస్తుందని చెప్పింది.
ఆ తర్వాత ఇంటి సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఇక ప్రోమో చివరిలో నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిని నిల్చోమని చెప్పి.. ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు నాగార్జున. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులు అంతా టెన్షన్ గా కనిపించారు. ఇక ఈరోజు ఎలిమినేట్ అయ్యింది ఎవరనేది తెలియాలంటే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.