Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ పై పాట బిడ్డ షాకింగ్ కామెంట్స్.. ఊహించని మెలిక పెట్టిన నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కనిపించారు. నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ పై పాట బిడ్డ షాకింగ్ కామెంట్స్.. ఊహించని మెలిక పెట్టిన నాగార్జున

Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమో వచ్చేసింది. సండే ఫన్ డే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగా ఉన్నట్లు కనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో అందరికీ ఫుల్ క్లాస్ ఇచ్చిన నాగార్జున ఈ రోజు ఎపిసోడ్ లో అందరితో ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులను వాళ్ళకు ఇష్టమైన ఇద్దరి ఫొటోలను పడవలో ఉంచమని తెలిపారు. ఈ టాస్క్ లో ఓ మెలిక పెట్టారు నాగార్జున.. పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే ఆ ఇద్దరిలో నుంచి ఎవరిని నీటిలోకి తోస్తావు అనేది చెప్పాలని సూచించాడు.

ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ ప్రోమోలో గౌతమ్, అమర్, అర్జున్, తేజ, భోలే, యావర్ ముందుగా ఆడినట్లు చూపించారు.

publive-image

గౌతమ్
ఈ టాస్క్ ఆడడానికి వచ్చిన గౌతమ్ ప్రియాంక, అర్జున్ ఇద్దరి ఫొటోలను పడవలో పెట్టాడు. వారిలో నుంచి ఒకరిని తోసేయాలంటే.. అర్జున్ పేరు చెప్పాడు. దానికి గౌతమ్ చెప్పిన కారణం ముందు నుంచి ప్రియాంక తో నాకు చెల్లెమ్మ అనే బంధం ఏర్పడింది అందుకే తనను తోయలేను అని చెప్పాడు.

publive-image

యావర్
యావర్ శివాజీ, రతిక ఫొటోలను పడవలో పెట్టాడు. నాగార్జున ఎవరిని తోసేస్తావు అని అడగగా యావర్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి యావర్ ఎవరిది పెడితే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా? అంటూ ఫన్ చేశాడు నాగార్జున.

అమర్
అమర్.. శోభ, ప్రియాంక ఫొటోలను పడవలో పెట్టాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని ముంచేస్తావు? అని అడిగారు నాగార్జున. దానికి అమర్ వీళ్లిద్దరి మధ్యలో నేను మునిగిపోయేలా ఉన్నాను సార్ అంటూ చమత్కారంగా మాట్లాడాడు.

publive-image

అర్జున్
ఆ తర్వాత వచ్చిన అర్జున్.. తనకు ఇష్టమైన వాళ్లుగా అమర్, గౌతమ్ ఫోటోలను పడవలో పెట్టాడు. వాళ్ళిద్దరిలో అమర్ ను పడవలో నుంచి తోసేస్తా అని చెప్పాడు. ఎందుకంటే అమర్ ఇప్పటి నుంచి అయిన ఎవరి పై ఆధారపడకుండా తన సొంతగా గేమ్ ఆడాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్నాక అమర్ కొంచం ఫీల్ అయినట్లుగా కనిపించాడు ప్రోమోలో.

శివాజీ
ఇక శివాజీ అందరు ఊహించినట్లే తను ఎప్పుడూ సపోర్ట్ చేసే యావర్, ప్రశాంత్ ఫొటోలను పడవలో పెట్టాడు. వీళ్ళిద్దరిలో యావర్ ను పడవలో నుంచి తోసేస్తాను అని చెబుతూ.. నేను ఇక్కడ ఉన్నా.. లేకపోయినా.. యావర్ టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.

publive-image

భోలే
ఇక భోలే వచ్చి అశ్విని, ప్రశాంత్ ఫొటోలను పడవలో పెట్టి.. ఒక రైతు బిడ్డగా వచ్చి ఇక్కడ తన బీజాన్ని గట్టిగా ఏర్పరుచుకున్నాడు అంటూ ప్రశాంత్ పై ప్రశంశల వర్షం కురిపించాడు.

publive-image

Also Read: Guntur Kaaram: గుంటూరు కారం కోసం థమన్ రాయబారం!

Advertisment
తాజా కథనాలు