Bigg Boss 7 Telugu Promo: అసలు ఈ వారం ఏమైనా ఆడవా .. సీసా బద్దలు కొట్టిన నాగార్జున..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున.. ఈ వారం ఇంటి సభ్యుల ఆట గురించి మాట్లాడుతూ.. అందరికి గట్టిగానే క్లాస్ ఇచ్చారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: అసలు ఈ వారం ఏమైనా ఆడవా .. సీసా బద్దలు కొట్టిన నాగార్జున..!

Bigg Boss 7 Telugu Promo:  బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల ఆట గురించి మాట్లాడుతూ.. హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యారు. ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ పై గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.. "సీసా తల మీద బద్దలు కొట్టి.. మరీ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని" అంటూ  సీరియస్ గా కనిపించాడు.

publive-image

ముందుగా నాగార్జున.. శివాజీతో మాట్లాడుతూ.. "నాకు నీతో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. వెంటనే శివాజీ .. 'నా బూతుల గురించేనా సార్ అని చెప్పగా'.. నాగార్జున అవును అని చెప్పారు. ఇంట్లో మాట్లాడే మాటలేనా అవి.. ఈ విషయంలో నీ.. అనుభవం , సహనం, సమర్థత ఏమయ్యాయి అంటూ శివాజీ బూతుల పై గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున. ఇక ఈ వారం కూడా రతికకు.. నాగార్జున చేతిలో క్లాస్ తప్పలేదు. రతికతో మాట్లాడుతూ.. "ఈ వారం నుంచి బిగ్ బాస్ ఇంట్లో.. నేనేంటో చూపిస్తా.. నెక్స్ట్ వీక్ నుంచి బాగా ఆడతాను" అనే పదాలు బ్యాన్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి వారం చెప్పడమే ఉంది కానీ ఆడడమేమి లేదని ఇండైరెక్ట్ గా రతికకు కౌంటర్ ఇచ్చారు నాగార్జున.

publive-image

చెల్లిని గెలిపించడం తప్ప ఏమైనా చేశావా

ఆ తర్వాత గౌతమ్ తో మాట్లాడుతూ.. "ఈ వారం మీ చెల్లెలు.. ప్రియాంకను గెలిపించడం తప్ప.. ఏదైనా చేశావా" అని క్లాస్ ఇచ్చారు నాగార్జున. ఇక అశ్విని గురించి మాట్లాడుతూ.. "నామినేషన్స్ లో.. ప్రియాంక నీ తల పై షుగర్ బాటిల్ తో కొడితే ఏదో తల పగిలిపోయినట్లు చేశావు.. బిగ్ బాస్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా".. అని కోప్పడ్డారు. అంతే కాదు ఆ బాటిల్ నాగార్జున తన చేతి పై పలగగొట్టి.. ఏం కాదని మరీ చూపించాడు.

publive-image

అసలు ఈ వారం ఏమైనా ఆడవా..?

ప్రశాంత్.. అసలు ఈ వారం ఏమైనా ఆట ఆడవా ..? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టాప్ 5 లో ఉంటావని చెప్పగానే.. ఫిక్స్ అయిపోయి.. వేరే వాళ్లకు ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నావా..? అని ప్రశాంత్ కు గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: రతిక ఎలిమినేటెడ్..? ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ తో ఊహించని ట్విస్ట్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు