/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-39-1-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 దసరా సందర్బంగా బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో హౌస్ మేట్స్ అంతా ఆడుతూ.. పాడుతూ సందడి చేశారు. ఇక సెలెబ్రెటీస్ స్పెషల్ పెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ అదిరిపోయింది. దసరా సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. గత వారంలో జరిగిన టాస్క్ లో వాళ్ళ ఉత్తరాలను త్యాగం చేసిన సభ్యులకు ఈ రోజు వారి ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ బిగ్ బాస్ ఇస్తున్నట్లు నాగార్జున తెలిపారు. ఇక ఈరోజు ప్రోమో అంతా చాలా సందడిగా కనిపించింది. కానీ చివరిలో నాగార్జున ఒక ట్విస్ట్ ఇచ్చారు.
ఫన్ గేమ్స్
ఇక నాగార్జున ఇంటి సభ్యులకు 'నాగిని డాన్స్' అని ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రియాంక, శోభ ఇద్దరు కలిసి నాగిని డాన్స్ చేస్తూ చాలా ఫన్ చేశారు. ఆ తర్వాత అర్జున్, అశ్విని 'పోల్ డాన్స్' చేశారు. వీళ్ళ డాన్స్ చూసిన నాగార్జున.. అర్జున్ పోల్ డాన్స్ లో బాగా అనుభవం ఉన్నట్లుంది అంటూ కాస్త ఫన్ చేస్తూ అర్జున్ ని అట పట్టించారు. అంతే కాదు తేజ.. ఇప్పటికైనా శోభ పేరు టాటూ వేయించుకుంటావా అంటూ నాగార్జున తేజతో ఫన్ చేశారు.
ఇంటి నుంచి లెటర్స్
బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తమ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్ పంపారు. ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని తెలియగానే అందరు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. శోభ, అమర్, తేజ, యావర్ అందరు వాళ్ళ లెటర్స్ చదువుతూ కనీళ్ళు పెట్టుకున్నట్లు ప్రోమోలో కనిపించింది.
నాగార్జున ట్విస్ట్
ప్రోమో అంతా చాలా ఫన్నీగా , సందడిగా సాగింది కానీ చివరిలో నాగార్జున ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. గత వారంలో శుభ శ్రీ, దామిని, రతిక వీళ్ళు ముగ్గురు లో ఒకరు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఇంటి సభ్యులు ఓటింగ్ కూడా చేశారు. ఇక ఈరోజు ప్రోమోలో నాగార్జున దసరా కనుకగా ఇంట్లోకి రాబోతున్నది ఎవరో చూద్దాం అని ఇంటి సభ్యులను సస్పెన్స్ లో పెట్టినట్లు ప్రోమోలో చూపించారు. సోషల్ మీడియాలో రతిక రీ ఎంట్రీ అంటూ ఇప్పటికే చాలా బజ్ నడిచిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఎపిసోడ్ తో అసలు రీ ఎంట్రీ ఇచ్చింది ఎవరు అనేది తేలిపోతుంది.
Also Read: Bigg Boss 7 Telugu: పాము ఎవరు, నిచ్చెన ఎవరు..? ఇంటి సభ్యులకు నాగార్జున గేమ్