Bigg Boss 7 Telugu Promo: "తిట్టనీ.. నరికేయనీ".. నా గేమ్ నా ఇష్టం.. రెచ్చిపోయిన గౌతమ్, శివాజీ..!

బిగ్ బాస్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఈ వారమంతా ప్రశాంతంగా సాగిన బిగ్ బాస్ ఇంట్లో.. కెప్టెన్సీ టాస్క్ పెద్ద రచ్చ సృష్టించింది. కెప్టెన్సీ టాస్క్ లో శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీళ్ళ అరుపులతో బిగ్ బాస్ ఇల్లంతా హీటెక్కిపోయింది.

New Update
Bigg Boss 7 Telugu Promo: "తిట్టనీ.. నరికేయనీ".. నా గేమ్ నా ఇష్టం.. రెచ్చిపోయిన గౌతమ్, శివాజీ..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఈ వారం ఎపిసోడ్ అంతా ఆనందంగా, ప్రశాంతగా సాగింది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ ఇల్లంతా ఎమోషనల్ మూమెంట్స్ తో నిండిపోయింది. ఈ వారమంతా టాస్క్ లు, గొడవలు లేకుండా సరదాగా సాగిన బిగ్ బాస్ ఇంట్లో.. కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

publive-image

'ఇంటి సభ్యులందరు ఈ వారం కెప్టెన్సీ కోసం 'ఓ బేబీ' టాస్క్ లో పాల్గొంటారని' బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్క్ లో బేబీ సౌండ్ మోగిన ప్రతి సారీ.. ఇంటి సభ్యులందరు.. మిగతా పోటీదారుల బేబీస్ నుంచి.. ఒక బేబీని తీసుకొని.. అవతలి వైపు ఉన్న 'బేబీ కేర్ జోన్' లోపలి వెళ్లాలని తెలిపారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అందరి కన్నా చివరిగా బేబీ కేర్ జోన్ లోకి వచ్చిన సభ్యుల దగ్గర ఎవరి బేబీ అయితే ఉంటుందో వాళ్ళు కెప్టెన్సీ రేసు నుంచి తొలగిపోతారని చెప్పారు.

publive-image

ఈ టాస్క్ లో యావర్, అమర్ మధ్య వాదనలు జరిగాయి. ఇక శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య పెద్ద గొడవనే జరిగింది. ఇద్దరు ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. "చాలా సార్లు చెప్పిన నీకు.. ఊరికే గొడవ పెట్టుకుంటే ఎవ్వరు ఒప్పుకోరు.. అని గౌతమ్ పై కోప్పడ్డాడు శివాజీ. ఇక గౌతమ్.. "అవును నాకు అన్యాయం జరిగితే నేను అరుస్తా అంటూ గట్టి గట్టిగా అరిచాడు. వీళ్లిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వీళ్ళ గొడవ.. గౌతమ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతా అనే వరకు వెళ్ళింది. ఇక  గౌతమ్ మైక్ విసిరేసి.. డోర్ దగ్గరకు వెళ్లి బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను.. ఓపెన్ ద డోర్ అంటూ గట్టిగా గట్టిగా అరిచినట్లు ప్రోమోలో కనిపించింది.

publive-image

Also Read: Bigg Boss Telugu 7 Promo 1: “తగ్గేదే లేదు బిడ్డ”.. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు