/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-80-jpg.webp)
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమో కొంచం ఫన్నీగా, కొంచం సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ టేస్టీ తేజకు (Teja) ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో తేజ లేడి గెటప్ లో కనిపించాడు. ఇక శోభ.. తేజకు చీర, బొట్టు పెడుతూ.. రెడీ చేస్తూ ఫన్నీగా కనిపించారు. ఆ తర్వాత శివాజీ, రతిక, శోభ.. నవ్వుకుంటూ కాసేపు తేజను ఆట పట్టించారు.
Also Read: Varun-Lavanya Marriage: కొడుకు పెళ్ళికి దూరంగా పవన్ కళ్యాణ్..!
అంత సేపు ఫన్నీగా సాగిన ప్రోమోలో.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్ తో ఇంట్లో అసలైన రచ్చ మొదలైంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్.. 'Hall of Ball' దీంట్లో ఇంటి సభ్యులు తమకున్న వ్యక్తిగత బలాలను పూర్తిగా ఉపయోగించి ఆడాలని బిగ్ బాస్ తెలిపారు.
'Hall of Ball' టాస్క్ లో పై నుంచి పడుతున్న బాల్స్ ను హౌజ్ మేట్స్ తమకిచ్చిన బ్యాగ్స్ లో క్యాచ్ చేయాలి. ఇక టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఒకరిని.. ఒకరు తోసుకుంటూ వెళ్లి బాల్స్ క్యాచ్ చేయడం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో అర్జున్, గౌతమ్ ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగినట్లుగా కనిపించింది. గౌతమ్.. అర్జున్ బ్యాగ్ విసిరేశాడు దాంతో అర్జున్.. నా బ్యాగ్ లాగాడు ఇక నేను కూడా అందరి బ్యాగ్స్ లాగేస్తాను అంటూ వాదించాడు.
ఆ తర్వాత శివాజీ (Shivaji) మాట్లాడుతూ.. ఈ హౌజ్ లో వాళ్లకు నేర్పిందే మనం .. మన మీదనే ప్లే చేస్తున్నారు అంటూ ఆరోపించాడు. ఇక్కడ శివాజీ మాట్లాడింది ఎవరి గురించి అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
ప్రోమోలో అమర్.. కెప్టెన్ గౌతమ్ తో.. రతిక (Rathika) ఫౌల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఆరోపించినట్లు ప్రోమోలో కనిపించింది. ఇక ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. మరి ఎపిసోడ్ కూడా అలానే ఉంటుందా, లేదా అనేది చూడాలి.