Bigg Boss 7 Telugu: తొందర పడిన ప్రశాంత్.. ఫినాలే రేసులో దూసుకెళ్తున్న అమర్.. !

బిగ్ బాస్ సీజన్ 7.. టికెట్ టూ ఫినాలే కోసం జరుగుతున్న పోటీలో ఇప్పటికే శోభ, ప్రియాంక, యావర్, శివాజీ రేసు నుంచి తొలగిపోయారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్న అర్జున్, గౌతమ్, ప్రశాంత్, అమర్ మరో ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

New Update
Bigg Boss 7 Telugu:  తొందర పడిన ప్రశాంత్.. ఫినాలే  రేసులో దూసుకెళ్తున్న అమర్.. !

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఇంటి సభ్యులు టికెట్ టూ ఫినాలే కోసం పోటీపడుతున్నారు. బిగ్ బాస్.. టికెట్ టూ ఫినాలే టాస్క్ ను పలు లెవెల్స్ గా నిర్వహించారు. ఇప్పటికే 7 లెవెల్స్ పూర్తయ్యాయి. 7 లెవెల్స్ పూర్తయ్యేసరికి కేవలం నలుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. శోభ, శివాజీ, యావర్, ప్రియాంక ఈ టాస్క్ నుంచి తొలగిపోయారు. ఇక తాజాగా ఈరోజు ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో టికెట్ టూ ఫినాలే టాస్క్ తదుపరి ఛాలెంజ్ లో అర్జున్, గౌతమ్, ప్రశాంత్, అమర్ పాల్గొన్నారు. ప్రోమోలో చూపిన ప్రకారం అందరికన్నా తక్కువ పాయింట్స్ ఉన్న రేసు నుంచి ఔట్ అయ్యాడు. ఫినాలే నుంచి ఔట్ అయిన గౌతమ్ తాను గెలుచుకున్న పాయింట్స్ అమర్ కు ఇచ్చేసి వెళ్ళాడు.

publive-image

ప్రియాంక కోసం అమర్ కు పాయింట్స్ ఇచ్చిన గౌతమ్

ప్రోమో చూస్తుంటే కేవలం ప్రియాంక కోసం మాత్రమే గౌతమ్ తన పాయింట్స్ అమర్ కు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. గౌతమ్ రేసు నుంచి ఔట్ అయినప్పుడు తాను గెలుచుకున్న అర్జున్ కు ఇవ్వాలనేది తన నిర్ణయం. కానీ ఇంతకముందు రౌండ్ లో ప్రియాంక రేస్ నుంచి తొలగిపోయినప్పుడు తన పాయింట్స్ గౌతమ్ కోసం ఇచ్చేసి వెళ్ళింది. అందుకని గౌతమ్ ప్రియాంక కోరిక ప్రకారం అమర్ కోసం తన పాయింట్స్ ఇచ్చాడు. దీంతో అమర్ స్కోర్ బోర్డు లో అందరికంటే టాప్ లో ఉన్నాడు.

publive-image

తొందర పడ్డ ప్రశాంత్

గౌతమ్ రేసు నుంచి ఔట్ అయిన తర్వాత టికెట్ టూ ఫినాలే రేస్ లో కేవలం అర్జున్, ప్రశాంత్, అమర్ మాత్రమే ఉన్నారు. మళ్ళీ ముగ్గురి కోసం బిగ్ బాస్ ఇచ్చిన 'సార్ట్ ఔట్'. ఈ టాస్క్ లో పాల్గొనే హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చిన డిఫరెంట్ కలర్ బాల్స్ నుంచి వారికి ఇచ్చిన సేమ్ కలర్ బాల్స్ మాత్రమే 'సార్ట్ ఔట్' చేయాలనీ తెలిపారు. ఈ టాస్క్ అందరి కంటే ముందుగా అర్జున్ పూర్తి చేసి బెల్ మోగించాడు. ఆ తర్వాత పూర్తి చేసిన ప్రశాంత్ బెల్ మోగించడానికి వచ్చే ప్రయత్నంలో బాల్స్ కింద పడ్డాయి. దీంతో ప్రశాంత్ కాస్త తొందరపడినట్లు కనిపించింది. ప్రశాంత్ చేసిన తప్పు అమర్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

publive-image

Also Read: Actor Subbalakshmi: మలయాళ సీనియర్ నటి సుబ్బలక్ష్మీ కన్నుమూత..!

Advertisment
తాజా కథనాలు