Bigg Boss 7 Telugu: గీతూ కారు పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి..! బిగ్ బాస్ విజేతను ప్రకటించగానే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో కొంత మంది ఆకతాయిలు అమర్ దీప్ కారుతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ గీతూ, అశ్విని కార్ల పై దాడి చేశారు. ఈ ఘటన పై ఎక్స్ కంటెస్టెంట్ గీతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Archana 18 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నరప్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్థూడియో ముందు హంగామా చేశారు. ఒక్కసారిగా ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి అభిమానులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో కొంత మంది ఆకతాయిలు రన్నరప్ అమర్ దీప్ కారుతో పాటు ఎక్స్ కంటెస్టెంట్స్ కార్ల పై రాళ్లతో దాడి చేశారు. అటు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పై రాళ్లు విసురుతూ నానా హంగామా చేశారు. గీతు, అశ్విని కార్ల పై దాడి చేసి వారి కారు అద్దాలను పగలగొట్టారు. ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించిన వీడియోలు వైరాలవుతున్నాయి. ఈ ఘటన పై గీతు, అశ్విని స్పందించారు. కారు అద్దాలను పగలగొట్టడం పై సీరియస్ అయ్యారు. ఈ విషయం పై గీతు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని పై ఎక్స్ కంటెస్టెంట్ గీతు మాట్లాడారు. "బజ్ షూట్ పూర్తి వెళ్తుండగా కొందరు ఆకతాయిలు నా కారు అద్దాలను కొడుతూ.. అద్దాల లోపల చేతులు పెట్టి కారు పై దాడి చేశారు అంటూ సీరియస్ అయ్యింది. ఎంతో కష్టపడి కారు కొన్నాను.. దాని EMI కూడా ఇంకా పూర్తి కాలేదని వాపోయింది. ఏ ఫ్యాన్స్ ఇలా బిహేవ్ చేయరు.. అసలు వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదేమో.. ఎవరో ఆకతాయిలు అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. గత సీజన్స్ లో కూడా ఫినాలే ఎపిసోడ్ తర్వాత స్టూడియో ముందు ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఫైనలిస్టుల ఫ్యాన్స్ రెచ్చిపోయి స్టూడియో ముందు బీభత్సం సృష్టించారు. Also Read: Bigg Boss Ashwini: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన అశ్విని..! #bigg-boss-7-telugu #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి