Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్స్ రచ్చ మొదలైనట్లు కనిపించింది. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. "ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా మీరు సింహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అసలే చాలా ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తుంది. మీరు అనర్హులుగా భావించిన.. ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటో ఉన్న చికెన్ ముక్కను తీసుకొని సింహం నోట్లో వేసి దాని ఆకలి తీర్చాల్సి ఉంటుందని" తెలిపారు బిగ్ బాస్.
ఈ ప్రక్రియలో.. ముందుగా వచ్చిన అమర్.. యావర్ ను నామినేట్ చేశాడు. దానికి అమర్ చెప్పిన కారణం..లాస్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో.. "నువ్వు కాలు కింద పెట్టావా..? అని అడిగితే లేదు అని చెప్పావు. కానీ కింద పెట్టావు.. దాని వల్ల.. నీతో పాటు గేమ్ ఆడిన అర్జున్ కు అన్యాయం జరిగిందని" చెప్పాడు అమర్. ఈ విషయంలో యావర్.. సంచలకుడిగా అది చూసుకోవాల్సిన బాధ్యత నీది అని అమర్ తో వాదించాడు. నెక్స్ట్ వచ్చిన అర్జున్ కూడా యావర్ ను ఇదే విషయంలో నామినేట్ చేశాడు.
ఆ తర్వాత గౌతమ్ ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. యావర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. "బాల్ పడిపోతుంటే దాన్ని చెయ్యితో పట్టుకున్నాడు అయినా సరే సంచాలకుడిగా నువ్వు ఏమీ చెప్పలేదు అది నాకు నచ్చలేదని ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఇక ప్రశాంత్ గౌతమ్ మాటలు వినకుండా.. అదే పనిగా వాదించడంతో.. "అన్న .. అన్న జరా వినరాదే" అంటూ డైలాగ్ వేశాడు గౌతమ్.
ఈ నామినేషన్ ప్రక్రియలో రతిక, ప్రశాంత్ వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ప్రక్రియలో ప్రశాంత్.. "వాళ్లకు దెబ్బ తగిలితే నీకు రక్తం వచ్చినట్లు చేస్తున్నావు" అని రతికతో వాదించాడు. ఇక రతిక 'అందరితో మాట్లాడినట్లు.. నాతో మాట్లాడాలని ట్రై చేయకు' అంటూ ప్రశాంత్ కు వార్నింగ్ ఇచ్చింది.
ఆ తర్వాత శివాజీ, గౌతమ్ ఇద్దరు ఆర్గుమెంట్ మొదలు పెట్టారు. గౌతమ్ శివాజీని ఫౌల్ గేమ్ ఆడవాని నామినేట్ చేశాడు. దానికి శివాజీ.. "నువ్వెవరు అయ్యా చెప్పడానికి.. నేను ఎక్కువ ఫౌల్స్ చేశానని" అంటూ గౌతమ్ పై ఫైర్ అయ్యాడు.