Bigg Boss 7 Telugu: ఆ విషయంలో శోభదే తప్పు.. ఇదిగో వీడియో ప్రూఫ్!

బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక ఈ వారం ఇంట్లో తప్పు చేసిన వారి గురించి చెబుతూ వారి ఫొటో ఉన్న జెండాలను విరిచేశారు. శోభకు మాత్రం వీడియో చూపించి మరీ షాక్ ఇచ్చారు నాగార్జున.

New Update
Bigg Boss 7 Telugu: ఆ విషయంలో శోభదే తప్పు.. ఇదిగో వీడియో ప్రూఫ్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో గత వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు నాగార్జున. ఇక వారంలో ప్రవర్తన, ఆటతీరు మంచిగా ఉన్న వాళ్ల జెండాను ఎగరవేసి, తప్పులు చేసిన వారివి విరిచేశారు.

శోభ యావర్ ను పిచ్చోడా అనడం కరెక్టా'

శోభ యావర్ మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ.. నాగార్జున కోపం వ్యక్తం చేశారు. 'శోభ యావర్ ను పిచ్చోడా అనడం కరెక్టా'.. అని ప్రశ్నించాడు. లాస్ట్ వీక్ లో..  భోలే నిన్ను  'ఎర్రగడ్డనే దిక్కు' అన్నాడని గింజుకున్నావు.. భోలే పై గట్టి గట్టిగా అరిచేశావు. మరి నువ్వు యావర్ ని ఎందుకు అన్నావు అంటూ శోభకు క్లాస్ ఇచ్చారు. దానికి శోభ స్పందిస్తూ.. యావర్ నన్ను కెప్టెన్సీ కి అనర్హురాలిగా చేసేందుకు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, ఆ సమయంలో నేను చెప్పేది వినకుండా..అలానే బిహేవ్ చేస్తుంటే నేను పిచ్చోడా అన్నాను అని తెలిపింది. దానికి నాగార్జున.. నిన్ను ఎర్రగడ్డ అన్నాడని భోలే క్షమించను అన్నావు.. మరి నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు అన్నారు.

publive-image

అందరు దొంగలే

'ఫ్లోట్ ఆర్ సింక్' టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడిన తేజ, అమర్ ఇద్దరికీ క్లాస్ ఇచ్చారు నాగార్జున. ఆ టాస్క్ లో సంచాలకుడిగా వ్యవహరించిన గౌతమ్ వీళ్లు చేసిన చీటింగ్ కనిపెట్టనందున సంచాలకుడిగా ఫెయిల్ అయినట్లు  తెలిపారు. ఆ తర్వాత సందీప్.. యావర్ తో  'బొంగు' అని మాట్లాడిన  విషయం పై కూడా సందీప్ ను హెచ్చరించాడు నాగార్జున.

publive-image

నిన్ను హిట్లర్ అన్నాడా..?

నామినేషన్స్ లో శోభ, యావర్ ని నామినేట్ చేస్తూ.. యావర్ 'నన్ను హిట్లర్ అన్నాడని' నామినేట్ చేసింది. ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ యావర్ హిట్లర్ అనే పదం నిజంగానే అన్నాడా అని ఇద్దరిని ప్రశ్నించాడు. ఇక ఈ విషయంలో శోభనే తప్పు చేసినట్లుగా ఓ వీడియో చూపించారు నాగార్జున. ఆ వీడియోలో యావర్ హిట్లర్ అనలేదని తేలిపోయింది.

నెగటివ్ టాక్ వద్దు శివాజీ

శివాజీ.. యావర్, రతిక తో మాట్లాడుతూ.. జనాలు, "మనుషులు అనేవారు ఉంటే ఈ వారం చూస్తా.. లేకపోతే ఎవరో ఒకరిని కొట్టి వెళ్లిపోతా’’ అంటూ నామినేషన్స్ గురించి మాట్లాడాడు. ఈ వీడియోను నాగార్జున శివాజీకి చూపించి ఎవరిని కొడతావు.. శివాజీ అని ప్రశ్నించాడు. దానికి శివాజీ 'నన్ను నేనే కొట్టుకుంటాను సార్' అని చెప్పాడు. సేఫ్ గేమ్ ఆడొద్దు శివాజీ, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పేసెయ్. అలాగే ప్రతీ సారి ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు.. ఈ నెగటివ్ టాక్ వద్దు. నీ చెయ్యి బాగాలేకున్నా గేమ్ చాలా బాగా ఆడావు అలాగే ఆడు అని చెప్పాడు.

publive-image

Also Read: Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్..?!

Advertisment
తాజా కథనాలు