Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ ప్రశాంత్ కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. పాపం శివాజీ కూడా హ్యాండిచ్చాడుగా!

బిగ్ బాస్ లో రైతు బిడ్డగా తనకంటూ ప్రత్యేకత చాటుతున్న.. పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన క్యాప్టెన్సీ రద్దు చేసినట్లు ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. శివాజీ కూడా ప్రశాంత్ కు సపోర్ట్ చేయకపోవడం బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు.

New Update
Bigg Boss 7 Telugu Promo:  రైతు బిడ్డ ప్రశాంత్ కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. పాపం శివాజీ కూడా హ్యాండిచ్చాడుగా!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా ఇటీవల పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)  అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. మొదటి కెప్టెన్ అయిన ప్రశాంత్ బాధ్యతలను సరిగ్గా నిర్వహించనందున బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ ని రద్దు చేసినట్లు తెలిసింది. ఇంటి సభ్యులలో మెజారిటీ సభ్యులు ప్రశాంత్ కెప్టెన్ బాధ్యతలను సరిగ్గా చేయట్లేదని ఓటు వేయడంతో బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటిచనున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది.

కెప్టెన్సీ రద్దు

ఈ రోజు ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులను (House Mates) కెప్టెన్ కు ఉండాల్సిన బాధ్యతలేంటని అడగగా.. 'అందరు కెప్టెన్ (Captain) అనే వాడు బాధ్యతగా ఉండాలి, తను పని చేస్తూ ఇతరులను పని చేయించాలి, కెప్టెన్ అంటే ఇంటికి బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లాంటి వాడు, కెప్టెన్ అనేవాడికి నాయకత్వపు లక్షణాలు ఉండాలని ఇలా అందరు తమ కారణాలను చెబుతారు.' తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు ప్రశాంత్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు అన్నవాళ్ళు ఎంత మందని అడగగా.. మెజారిటీ సభ్యులు ఓట్ వేశారు. దాంతో బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ నీ రద్దు చేస్తున్నట్లో ప్రోమోలో తెలుస్తోంది.

Also Read: దుమ్ములేపుతున్న బతుకమ్మ పాటలు..! మొదలైన బతుకమ్మ సంబరాలు..
publive-image

ప్రశాంత్ కు షాకిచ్చిన శివాజీ..

ఆట మొదటి నుంచి ప్రశాంత్ కు సపోర్ట్ గా ఉంటున్న శివాజీ(Sivaji) కూడా ప్రశాంత్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడని ఓట్ చేయడం బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఇంటి సభ్యులందరు ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్పడంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఏడుస్తున్న ప్రశాంత్

ఇంటి సభ్యులంతా కలిసి ప్రశాంత్ కెప్టెన్సీ నీ రద్దు చేయడంతో. ప్రశాంత్.. బిగ్ బాస్ నా మాట ఎవరూ వినడం లేదు, అలాగే నేను చెప్పేది కూడా పట్టించుకోవడం లేదు అంటూ ఏడ్చాడు. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ రైతు బిడ్డకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఎంతో కష్టపడి బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అయిన రైతు బిడ్డ తన కెప్టెన్సీ తో పాటు రెండు వారల ఇమ్యూనిటీ కూడా పోవడంతో చాలా బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇంటి సభ్యులంతా ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది.

Also Read: Bigg Boss 7 Telugu Promo: కెప్టెన్సీ యుద్ధం.. బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ ..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు