Bigg Boss 7 Telugu: నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్.. ఇది చాలా తప్పు..!

బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ విషయంలో శివాజీ, గౌతమ్ ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఇక గౌతమ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్ అంటూ కెమెరా ముందుకెళ్లి మాట్లాడాడు.

Bigg Boss 7 Telugu: నన్ను ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్.. ఇది చాలా తప్పు..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. 'గర్జించే పులులు', 'వీర సింహాలు' ఇలా రెండు టీమ్స్ గా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజెస్ లో పాల్గొన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కోసం ఇచ్చిన ఛాలెంజెస్ లో గెలిచిన 'వీర సింహాలు' టీమ్ సభ్యులు ఫైనల్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

publive-image

కెప్టెన్సీ పోటీదారులు

'వీర సింహాలు' టీమ్ నుంచి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన సభ్యులు .. శోభ, తేజ, యావర్, గౌతమ్, అర్జున్, రతిక. ఈ కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పోటీదారులైన శోభ, తేజ, యావర్, గౌతమ్, అర్జున్, రతిక ఐదుగురు మీ  కోసం .. మీ స్థానంలో ఆపోజిట్ టీమ్ సభ్యులు ఈ టాస్క్ ఆడేందుకు ఒప్పించాలని తెలిపారు. పోటీదారుల కోసం  ఆపోజిట్ టీం సభ్యులైన అశ్విని, శివాజీ, అమర్, ప్రియాంక, భోలే ఈ టాస్క్ లో పాల్గొన్నారు.

publive-image

మీరు చెప్పినట్టే వినాలా

శివాజీ (Shivaji), గౌతమ్ (Goutham) ఇద్దరి మధ్య కెప్టెన్సీ టాస్క్ విషయంలో గొడవ జరిగింది. శివాజీ మాట్లాడుతూ.. గౌతమ్ ఇంతకముందు కెప్టెన్ అయ్యాడు కదా.. ఈ సారి వేరే వాళ్లకు ఛాన్స్ ఇద్దామని అన్నాడు. దాంతో గౌతమ్ ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదా.. మీరు చెప్పినట్టే వినాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నా.. అంటూ శివాజితో వాదించాడు.

publive-image

నన్ను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్

శివాజీ మాటలకు హర్ట్ అయిన గౌతమ్.. బిగ్ బాస్ నన్ను కన్ఫెషన్ రూమ్ కు పిలవండి అని కోరాడు. ఇక్కడ కొన్ని విషయాలు చాలా తప్పుగా ఉన్నాయి. ఇవి ఇలాగే జరిగితే నేను అంగీకరించను.. నేను బయటకు వెళ్ళడానికి కూడా సిద్ధమే.. నన్ను ఎలిమినేట్ చేసేయండి.. అంటూ కెమెరా ముందు మాట్లాడాడు. గేమ్ కు ముందు శివాజీ అందరినీ పిలిచి.. గౌతమ్ ఇంతకుముందే కెప్టెన్ అయ్యాడు.. మళ్ళీ అవ్వకూడదని చెప్పాడు. ఫిజికల్ గేమ్స్ లో కూడా ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ.. నీతి, ధర్మం, నిజాయితీ అని చెబుతారు. శివాజీ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.. అవి అందరికి క్లియర్ గా కనిపిస్తున్నాయి.. అంటూ గౌతమ్ శివాజీ గురించి ఆరోపించాడు.

Bigg Boss 7 Telugu

శోభను గెలిపించిన అమర్

కెప్టెన్సీ పోటీదారులైన శోభ, గౌతమ్, అర్జున్, రతిక, తేజ, కోసం టాస్క్ ఆడిన అమర్, అశ్విని, శివాజీ, భోలే, ప్రియాంకలో..  శోభ కోసం ఆడిన అమర్ టాస్క్ గెలవడంతో శోభ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా నిలిచింది.

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu Promo: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..!

#bigg-boss-7-latest-episode #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe