Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో 'శ్రీమంతం' వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా అర్జున్ వైఫ్ సురేఖ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. బిగ్ బాస్ అర్జున్ కు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. అర్జున్ వైఫ్ సురేఖకు బిగ్ బాస్ ఇంట్లో శ్రీమంతం జరిపించారు.

New Update
Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో 'శ్రీమంతం' వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఇంటి సభ్యుల ఫ్యామిలీస్ వచ్చారు. ముందుగా శివాజీ కొడుకు బిగ్ బాస్ ఇంట్లోకి డాక్టర్ గెటప్ లో వచ్చి శివాజీకి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈ ప్రోమోలో అర్జున్ వైఫ్ సురేఖ ఇంట్లోకి వచ్చింది. భార్యను చూసి అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్జున్ ని చూడగానే సురేఖ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రోమో చాలా ఎమోషనల్ గా కనిపించింది.

అర్జున్ తన భార్య సురేఖను ఇంటి సభ్యులందరికి పరిచయం చేశాడు. సురేఖ అర్జున్ తో తన ఆట గురించి మాట్లాడుతూ.. నీ ఎమోషన్స్ అన్ని బయట పెట్టు.. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదని అర్జున్ కి గేమ్ విషయంలో బయట ప్రేక్షకుల అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 'కప్పు ముఖ్యం బిగులు' అంటూ అర్జున్ తో చెప్పింది.

publive-image

ఆ తర్వాత అర్జున్ కు బిగ్ బాస్ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. అర్జున్ వైఫ్ సురేఖకు బిగ్ బాస్ ఇంట్లో శ్రీమంతం జరిపించారు. బిగ్ బాస్ ఇంట్లో తన భార్య శ్రీమంతాన్ని చూసి అర్జున్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే కాదు ఎప్పుడు స్ట్రాంగ్ గా  కనిపించే అర్జున్ ఎమోషనల్ అయిపోయి.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఇంటి సభ్యులు కూడా షాకయ్యారు.  ఇక అర్జున్ వైఫ్ సురేఖ కూడా ఎమోషనల్ అయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత.. మా ఆయన అంటే భయం పోయిందా అంటూ అశ్వినితో ఫన్ చేసింది సురేఖ.

publive-image

ఇక ఈ వారం అంతా బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మిగతా ఇంటి సభ్యులు అందరు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు