Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి అర్జున్ వైఫ్.. 'కప్పు ముఖ్యం బిగులు'

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్, శివాజీ, అశ్విని ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు.

New Update
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి అర్జున్ వైఫ్.. 'కప్పు ముఖ్యం బిగులు'

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ హంగామా మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో చాలా ఎమోషనల్ గా ముగిసింది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ ఇంట్లోకి ఇంటిసభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.

బిగ్ బాస్ ఇంట్లోకి మొదటి ఫ్యామిలీ మెంబర్ గా శివాజీ (Shivaji) కొడుకు ఎంటర్ అయ్యాడు. ఇక శివాజీ కొడుకు ఎంట్రీని బిగ్ బాస్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. శివాజీ కొడుకును డాక్టర్ గెటప్ లో పంపి శివాజీని సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. రాగానే  శివాజీ కొడుకు ఇంటి సభ్యులతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ తో.. తన గేమ్ గురించి మాట్లాడుతూ.. 'కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. అవి మనకు తప్పుగా అనిపించవు కానీ ఎదుటివారు ఎలా తీసుకుంటారో తెలియదు కదా అంటూ కొన్ని హింట్స్ ఇచ్చాడు.

Also Read: KGF లేకపోతే యశ్ ఎవరు?..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు.!

Bigg Boss 7 Telugu

శివాజీ కొడుకు ప్రశాంత్ (Pallavi Prashnath) , యావర్ తో  మాట్లాడుతూ.. మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు బాగా చూసుకున్నారు.. మీ ఇద్దరికీ  చాలా థాంక్స్ అని చెప్పాడు. అంతే కాదు శివాజీకి మరో సలహా కూడా ఇచ్చాడు. యావర్, ప్రశాంత్ కాకుండా మిగతా వాళ్లని ఈజీ గా నమ్మకు నాన్న అని చెప్పాడు. ఇక శివాజీ కొడుకు రాగానే భోలే.. తన ఫ్యామిలీ గుర్తొస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ (Ambati Arjun) వైఫ్ సురేఖ ఇంట్లోకి వచ్చింది. సురేఖ రాగానే చాలా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్.. సురేఖ శ్రీమంతం వేడుకలను  జరిపించి.. అర్జున్ కు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక సురేఖ అర్జున్ తో 'కప్పు ముఖ్యం బిగులు'  అని చెప్పి వెళ్ళింది.

Bigg Boss 7 Telugu

ఆ తర్వాత బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. హౌస్ మేట్స్ అంతా ఫన్నీగా ఈ గేమ్ ఆడుతుండగా.. అశ్విని (Ashwini) మదర్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అశ్వినిని చూడగానే వాళ్ళ అమ్మ ఏడ్చేశారు. ఆ తర్వాత అశ్విని  గేమ్ గురించి కొన్ని సలహాలు ఇచ్చింది. 'శివాజీ చెప్పిన మాటలు విను.. గౌతమ్ తో ఎక్కువ ఉండకు' అన్నట్లుగా చెప్పింది. నీ గేమ్ పై మాత్రమే ఎక్కువ ఫోకస్ పెట్టు.. వేరే వాళ్ళ గురించి పట్టించుకోనని సలహా ఇచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu Promo: ‘నన్ను వదిలి పెట్టి వెళ్ళకు అమ్మ’.. కన్నీళ్లు పెట్టుకున్న అశ్విని..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు