Bigg Boss 7 Telugu: "నీ కన్నాపెద్దగా అరుస్తా.. ఎందుకు అరుస్తున్నావు".. రెచ్చిపోయిన శివాజీ..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం యావర్ తో ప్రియాంక, శివాజీ పోటీపడ్డారు. ఈ టాస్క్ లో శివాజీ రేసు నుంచి తొలగిపోయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఈ టాస్క్ విషయంలో శోభ, శివాజీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

New Update
Bigg Boss 7 Telugu: "నీ కన్నాపెద్దగా  అరుస్తా.. ఎందుకు అరుస్తున్నావు".. రెచ్చిపోయిన శివాజీ..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కోసం అర్జున్ తో యావర్ పోటీ పడ్డాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో యావర్ తో ప్రియాంక, శివాజీ పోటీ పడుతున్నట్లుగా కనిపించింది. ప్రోమోలో చూసిన ప్రకారం.. అర్జున్, యావర్ మధ్య జరిగిన టాస్క్ లో యావర్ గెలిచి ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు యావర్ తన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' కాపాడుకోవడానికి ఇద్దరితో డిఫెండ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు బిగ్ బాస్.

publive-image

ఈ ఛాలెంజ్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్.. "విల్లును పైకి ఎత్తి దాని పై ఉన్న బాల్స్ కింద పడకుండా బ్యాలెన్స్ చేయాలనీ" చెప్పారు. ఈ టాస్క్ లో యావర్ తో.. శివాజీ, ప్రియాంక పోటీపడతారని తెలిపారు బిగ్ బాస్. యావర్, ప్రియాంక, శివాజీ బాల్స్ ను విల్లు పై చాలా జాగ్రత్తగా హోల్డ్ చేశారు. ముగ్గురి మధ్య గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు ప్రోమోలో కనిపించింది.

publive-image

ఈ టాస్క్ లో సంచాలకులుగా శోభ, పల్లవి ప్రశాంత్ వ్యవహరించారు. టాస్క్ మధ్యలో శోభ, ప్రశాంత్ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ శివాజీ మాత్రం "మీ మాటలు డిస్టబెన్స్ గా ఉన్నాయి.. ఫోకస్ మిస్ అవుతుంది.. మాట్లాడకండి అని వాళ్ళ పై కోప్పడ్డాడు". ప్రోమోలో చూసిన ప్రకారం ప్రియాంక, శివాజీ బాల్స్ కింద పడినట్లుగా కనిపించింది. ఇక బిగ్ బాస్.. ఈ టాస్క్ లో రేసు నుంచి తొలగిపోయింది ఎవరని అడిగారు. సంచాలకులుగా వ్యవహరించిన శోభ.. "శివాజీ రేస్ నుంచి ఔట్ అయ్యారని చెప్పగానే.. శివాజీ ..కోపంతో నీకు ఇష్టం ఉన్నది చెప్పుకో.. అన్ ఫెయిర్ డెసిషన్"  అని శోభ పై ఫైర్ అయ్యాడు.  ఇక శోభ.. "మీరు ఇలా తప్పుగా  పోట్రె చేయాలని చూడకండి" అంటూ శివాజీ పై అరిచేసింది. శివాజీ కూడా.. "ఎందుకు అరుస్తున్నావు.. నీ కన్నా పెద్దగా అరుస్తాను" అని రెచ్చిపోయాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: అర్జున్ తో పోటీకి యావర్.. ఎవరి బాల్ పడింది..?

Advertisment
తాజా కథనాలు