Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రియాంక, శివాజీ.. యావర్ తో పోటీపడ్డారు. ఈ టాస్క్ లో గెలిచిన యావర్ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' సొంతం చేసుకున్నాడు. ఈ ఆటలో ఓడిపోయిన శివాజీ.. శోభతో ఆర్గుమెంట్ మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య వాదనలు కూడా జరిగాయి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ గా ప్రకటించారు.
కెప్టెన్సీ టాస్క్
ఈ వారం బిగ్ బాస్.. ఇంటి కెప్టెన్ అవ్వడానికి ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ ఫోర్ రౌండ్స్ గా జరిగింది. అందరికన్నా తక్కువ ఇటుకలను కలెక్ట్ చేసిన రతిక మొదటి రౌండ్ లోనే కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్ అయ్యింది. ఆ తర్వాత గౌతమ్, అశ్విని, శోభ, శివాజీ, యావర్ రేస్ నుంచి ఔట్ అయ్యారు. ఈ టాస్క్ లో ప్రియాంక, అర్జున్, ప్రశాంత్, అమర్, ఫైనల్ లెవెల్ కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి ఎంపికయ్యారు.
ఎవరు టవర్ పెద్దది
కెప్టెన్సీ కోసం ఫైనల్ లెవెల్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ "టవర్ బిల్డింగ్". ఈ టాస్క్ లో.. కంటెండర్స్ గా నిలిచిన సభ్యులు.. ముందుగా వాళ్లకు ఇచ్చిన ఇటుకలతో వీలైనంత ఎత్తుగా టవర్ బిల్డ్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. మిగతా ఇంటి సభ్యులు.. ఎవరైతే కెప్టెన్ గా అర్హులు కాదని భావిస్తారో.. మీకు ఇచ్చిన బాల్స్ తో వాళ్ళ టవర్ పడగొట్టే ప్రయత్నం చేసుకోవచ్చని ట్విస్ట్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ముందుగా ప్రశాంత్, ఆ తర్వాత అర్జున్ రేస్ నుంచి ఔట్ అయ్యారు. ఇక ప్రియాంక, అమర్ ఇద్దరి మధ్య చివరి లెవల్ జరిగింది.
ఏడిస్తే సరిపోదు.. డిఫెండ్ చేసుకో
ఫైనల్ కెప్టెన్సీ కోసం ప్రియాంక, అమర్ పోటీ పడ్డారు. ఇంటి సభ్యులంతా వీళ్లిద్దరి టవర్ కూల్చడానికి బాల్స్ తో కొట్టడం మొదలు పెట్టారు. ఇక ప్రియాంకను కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయిన గౌతమ్.. అమర్ టవర్ పడిపోవడానికి బాల్స్ తో కొట్టాడు. రతిక, అర్జున్, అశ్విని కూడా అమర్ ను టార్గెట్ చేసినట్లుగా అనిపించింది. అమర్.. "ప్లీజ్ రా.. వద్దు రా.. నా టవర్ పై బాల్స్ వేయకండి.. నాకు కెప్టెన్ అవ్వాలని ఉందని" అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చాడు. దాంతో శోభ.. ఏడిస్తే సరిపోదు.. డిఫెండ్ చేసుకో.. నువ్వెంత రిక్వెస్ట్ చేసిన ఎవ్వరు వినరు అమర్.. ఇది గేమ్ అంటూ అమర్ ను మోటివేట్ చేసింది. అమర్ ఎంత రిక్వెస్ట్ చేసిన లాభం లేకపోయింది.. చివరికి ప్రియాంక ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యింది.