Bigg Boss 7 Telugu: శోభాకు బిగ్ బాస్ వార్నింగ్.. ఇక శోభా ఇంటికే..?

బిగ్ బాస్ ఇంట్లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్  తదుపరి లెవెల్స్ లో పోటుగాళ్ళ పై ఆటగాళ్ళు విజయం సాధించడంతో ఇరు టీమ్స్ స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఆటగాళ్లు vs పోటుగాళ్ళు గా జరుగుతున్న ఈ టాస్క్ లో ముందు జరిగిన మూడు లెవెల్స్ లో పోటుగాళ్ళే గెలిచిన నిన్న జరిగిన టాస్క్ అన్నింటిలో ఆటగాళ్లు గెలిచి ఇద్దరి స్కోర్ మ్యాచ్ అయ్యేలా చేశారు. టాస్క్ లో  శోభా చేసిన పనికి బిగ్ బాస్ పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. 

Bigg Boss 7 Telugu: శోభాకు బిగ్ బాస్ వార్నింగ్.. ఇక శోభా ఇంటికే..?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్  తదుపరి లెవెల్స్ లో పోటుగాళ్ళ పై ఆటగాళ్ళు విజయం సాధించడంతో ఇరు టీమ్స్ స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఆటగాళ్లు vs పోటుగాళ్ళు గా జరుగుతున్న ఈ టాస్క్ లో ముందు జరిగిన మూడు లెవెల్స్ లో పోటుగాళ్ళే గెలిచిన నిన్న జరిగిన టాస్క్ అన్నింటిలో ఆటగాళ్లు గెలిచి ఇద్దరి స్కోర్ మ్యాచ్ అయ్యేలా చేశారు.

నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్.. బిగ్ బాస్ సినిమాలోని ఒక డైలాగ్ లేదా సాంగ్ ప్లే చేస్తే దాని విని వాటికీ సంబందించిన ప్లేస్, హీరో, హీరోయిన్ లేదా ఆ డైలాగ్ ఏ సినిమాలోది అనేది చెప్పాలి. ఈ టాస్క్ లో  ఇరు టీమ్స్ నుంచి ఒకరు వచ్చి పాల్గొంటారు. సినిమాకు సంబందించిన జవాబులను బిగ్ బాస్ ఒక కార్డ్ రూపంలో ఉంచారు. ఇరు టీమ్స్ నుంచి వచ్చిన పోటీదారులలో త్వరగా గెస్ చేసి కార్డు బోర్డు పై పెట్టిన వాళ్ళు విన్.

publive-image

గౌతమ్ ని ఇరిటేట్ చేసిన శోభా

బిగ్ బాస్ అడిగిన వెంటనే జవాబు తెలిసిన వాళ్ళు ఒక కార్డ్ మాత్రమే తీసుకొని బోర్డు పై పెట్టాలి కానీ శోభా అవతలి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా రెండు కార్డ్స్ తీసుకొని గౌతమ్ (Goutham) ఎంత అడిగిన ఇవ్వకుండా ఇది నా గేమ్, ఇది నా స్ట్రాటజీ అన్నట్లుగా ప్రవర్తించింది. శోభా చేసిన పనికి గౌతమ్ ఇలాంటి ఫౌల్ గేమ్స్ నువ్వు మాత్రమే ఆడతావని శోభా పై ఫైర్ అయ్యాడు.

publive-image

శోభాకు బిగ్ బాస్ వార్నింగ్

ఇక శోభా (Shobha) చేసిన పనికి బిగ్ బాస్ కూడా విసిగిపోయి ఆ రౌండ్ నే క్యాన్సల్ చేశాడు. ఒకేసారి రెండు కార్డ్స్ తీసుకోవద్దని బిగ్ బాస్ మొదటి రౌండ్ లో వార్నింగ్ ఇచ్చాడు. కానీ శోభా మళ్ళీ అవతలి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా రెండు కార్డ్స్ చేతిలో పట్టుకుంది. దాంతో బిగ్ బాస్ శోభా మీకు గేమ్ అర్థం కావట్లేదా లేదా అర్థమైన అలానే చేస్తున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

ఇక నిన్న జరిగిన కెప్టెన్స టాస్క్ లో రెండు రౌండ్స్ లో ఆటగాళ్లు విన్ అయ్యి స్కోర్ టై చేశారు. ఈరోజు ఫైనల్ రౌండ్ ఉండొచ్చు.. ఇంటి నెక్స్ట్ కెప్టెన్ ఆటగాళ్లా, పోటుగాళ్లా అనేది చూడాలి.

Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ..అర్జున్ స్ట్రాటజీ సూపర్

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe