Bigg Boss 7 Telugu: యావర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..? షాక్ లో ఇంటి సభ్యులు..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం టాస్కుల్లో ఇంటి సభ్యుల పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ అందరికీ క్లాస్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్.. యావర్ గెలిచిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వెనక్కి తీసుకొని పెద్ద షాకిచ్చారు.

New Update
Bigg Boss 7 Telugu: యావర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..? షాక్ లో ఇంటి సభ్యులు..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి గట్టిగానే ఫైర్ అయ్యారు. ఈ వారంలో జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్, కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ అందరికీ క్లాస్ ఇచ్చారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కాస్త సీరియస్ గానే కనిపించారు.

కెప్టెన్ ప్రియాంక

ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే.. నాగార్జున ప్రియాంక పై ప్రశంశల కురిపించాడు. కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ఆడిన విధానం, డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగా ఆడావు అని ప్రియాంకను మెచ్చుకున్నారు నాగార్జున. ఆ తర్వాత నాగార్జున శోభతో మాట్లాడుతూ.. ఈ వారం ఏం ఆడావు శోభ.. నీ గేమ్ అంతగా కనిపించలేదు.. ఇంకా బాగా ఆడాలి అని చెప్పారు.

publive-image

శివాజీ.. ఇలాంటి మాటలు వద్దు

నాగార్జున.. శివాజీ ఇంట్లో మాట్లాడుతున్న బూతుల గురించి గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక శివాజీ.. నేను అవి సరదాగా అన్నాను.. సీరియస్ గా ఎప్పుడు అనలేదు అంటూ నాగార్జునతో చెప్పాడు. నువ్వు సరదాగానే చెప్పినప్పటికీ .. చూసేవాళ్ళకు అవి తప్పుగా కనిపిస్తాయి.. ఇలాంటి మాటలు బిగ్ బాస్ లో మాట్లాడడం కరెక్టా ..? అని కోప్పడ్డారు.

publive-image

అమర్.. ఆటలో ఎమోషనల్ అవ్వకు

ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమర్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఏడవడం పై నాగార్జున స్పందించారు. అమర్.. గేమ్ లో ఉన్నప్పుడు.. డిఫెండ్ చేసుకోవాలి.. ఎమోషనల్ అవ్వకూడదు అని సలహా ఇచ్చారు. ఇక నుంచి గేమ్ లో ఏడవడం, ఎమోషనల్ అవ్వడం చేయకూడదు అని చెప్పారు.

publive-image

యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కు అనర్హుడు..

ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో యావర్ ఆడిన ఫౌల్ గేమ్ కు సంబంధిచిన వీడియోలను నాగార్జున ఇంటి సభ్యుల ముందు ప్రదర్శించారు. ఇవి చూసిన యావర్ తన తప్పును ఒప్పుకొని.. ఎవిక్షన్ పాస్ తిరిగి బిగ్ బాస్ కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో నాగార్జున ఇంటి సభ్యుల నిర్ణయం అడగగా.. అమర్, ప్రియాంక, శోభ యావర్ ఎవిక్షన్ పాస్ పొందడానికి అనర్హుడని చెప్పారు. బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ వెనక్కి తీసుకొని అందరికి పెద్ద షాకిచ్చారు.

publive-image

Also Read: Salman, Katrina Dance video: సల్మాన్, కత్రినా డాన్స్ వీడియో వైరల్..!

Advertisment
తాజా కథనాలు