Bigg Boss 7 Telugu: రతిక ఎలిమినేటెడ్..? 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' తో ఊహించని ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్స్ లో ఉన్న రతిక, శోభ, ప్రియాంక, యావర్, అమర్, అర్జున్ లో ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రతిక ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

New Update
Bigg Boss 7 Telugu:  రతిక ఎలిమినేటెడ్..?  'ఎవిక్షన్ ఫ్రీ పాస్' తో ఊహించని ట్విస్ట్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో చాలా చర్చలు వినిపిస్తున్నాయి. ఈ వారం గౌతమ్, అమర్, అశ్విని, రతిక, ప్రియాంక, అర్జున్, యావర్, శోభ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్, శివాజీ తప్ప మిగతా ఇంటి సభ్యులంతా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల.. ఎవరు ఎలిమినేట్ అవుతారా..? అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రియాంక, శోభ, అమర్, యావర్, గౌతమ్, అర్జున్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం రతిక లేదా అశ్విని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో రతిక ఎలిమినేటెడ్.. అని సోషల్ మీడియాలో తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ వారం పర్ఫామెన్స్ చూసిన.. రతిక అంతగా తన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయింది. ఈ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోయి రేస్ నుంచి ఔట్ అయ్యింది. అమర్, ప్రియాంక ఇద్దరి మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా.. రతిక అమర్ పట్ల ప్రవర్తించిన తీరు ప్రేక్షకుల్లో నెగటివ్ అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ జరిగిన డాల్ టాస్క్ లో అమర్, రతిక ఇద్దరిలో ఒకరు రేస్ నుంచి తప్పుకోవాలి అని చెప్పినప్పుడు.. అమర్ రతిక కోసం త్యాగం చేశాడు. కానీ రతిక.. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమర్ కు సహాయం చేయకపోవడమే కాకుండ.. అమర్ టవర్ ను పడగొట్టే ప్రయత్నం చేసింది.

publive-image

అమర్ చేసిన హెల్ప్ కు కృతజ్ఞత లేకుండ రతిక ఇలా చేయడం.. ప్రేక్షకుల్లో నెగిటివిటీ రావడంతో పాటు తన ఎలిమినేషన్ కు కూడా కారణమయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ వారం మరో ట్విస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న యావర్.. ఒకవేళ ఆ పాస్ రతిక ను సేవ్ చేయడానికి వాడితే దాని వల్ల మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Bigg Boss 7 Telugu: “ఏడిస్తే సరిపోదు.. డిఫెండ్ చేసుకో”.. కెప్టెన్సీ కోసం ఏడ్చేసిన అమర్..!

Advertisment
తాజా కథనాలు