Bigg Boss 7 Telugu: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss) ఇప్పటి వరకు జరిగిన వారాలలో బిగ్ బాస్ ప్రతి ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఇటు ప్రేక్షకులను, అటు హౌస్ మేట్స్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న బిగ్ బాస్ చూపించిన ప్రోమో అంతా నాటకం.

Bigg Boss 7 Telugu: ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన బిగ్ బాస్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు.. అసలేమైందంటే?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7  ఇప్పటి వరకు జరిగిన వారాలలో బిగ్ బాస్ ప్రతి ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఇటు ప్రేక్షకులను, అటు హౌస్ మేట్స్ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలాగే నిన్న బిగ్ బాస్ చూపించిన ప్రోమో అంతా నాటకం. నిన్నటి ప్రోమోలో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) కెప్టెన్సీ రద్దు అవ్వడం నిజమే కానీ మెజారిటీ ఇంటి సభ్యులు ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చినట్లు చెప్పారు. కానీ ప్రోమోలో మెజారిటీ ఇంటి సభ్యులు కెప్టెన్సీ నచ్చనట్లుగా ఓటు చేసినట్లు చూపించి బిగ్ బాస్ ప్రేక్షకులను బోల్తా కొట్టించాడు. దీంతో నెటిజెన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది భలే సర్ ప్రైజ్ అని అంటుండగా.. మరికొంత మంది మాత్రం రేటింగ్ పెంచుకోవడం కోసం బిగ్ బాస్ నిర్వాహకుల చీప్ ట్రిక్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ప్రశాంత్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ

ప్రశాంత్ కెప్టెన్సీ రద్దవడంతో ప్రశాంత్ తో పాటు శివాజీ (Sivaji) కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతో కష్టపడి వాడు కెప్టెన్ అయ్యాడు వాడి కోసం నా చేయి దెబ్బ తగిలినా.. లెక్కచేయలే అంటూ శివాజీ బాధపడ్డాడు. కానీ బిగ్ బాస్ ప్రోమోలో మరోలా ఉంది.
publive-image

ప్రశాంత్ కు బిగ్ బాస్ ట్విస్ట్

ప్రశాంత్ బిగ్ బాస్ ఇంటి నియమాలను సరిగ్గా పాటించడం లేదు.. అలాగే కెప్టెన్ గా తప్పు చేసిన తేజ (Teja), యావర్ (Yawar) కు శిక్షను అమలు చేయడంలో విఫలమయ్యారు అందుకని మీ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లుగా బిగ్ బాస్ తెలిపారు. దాంతో ప్రశాంత్ కనీళ్ళు పెట్టుకున్నాడు. కొంత సమయం తర్వాత బిగ్ బాస్ ప్రశాంత్ ను పిలిచి తిరిగి కెప్టెన్సీ ఇచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

Also Read: Song: ఇంకా దుమ్ములేపుతోన్న సీమ దసర సిన్నోడు సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా?

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి