Bigg Boss 7: శుభ శ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కు వెళ్ళింది వీళ్ళే ..?

ఈ వీక్  త్రిబుల్ లేదా డబల్ ఎలిమినేషన్ అంటూ చాలా పుకార్లు వినిపించాయి. అయితే శుభ శ్రీ ఎలిమినేట్ అనే వార్త బాగా వైరల్ అవుతుంది.

New Update
Bigg Boss 7: శుభ శ్రీ ఎలిమినేటెడ్.. సీక్రెట్ రూమ్ కు వెళ్ళింది వీళ్ళే ..?

Bigg Boss 7:  బిగ్ బాస్ సీజన్ 7 లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి.. ఈ వీక్  త్రిబుల్ లేదా డబల్ ఎలిమినేషన్ అంటూ చాలా పుకార్లు వినిపించాయి. అయితే శుభ శ్రీ ఎలిమినేట్ అనే వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ విడుదలైన ప్రోమో ఆడియెన్స్ లో మరింత ఆసక్తిని పెంచింది.

శుభ శ్రీ ఎలిమినేటెడ్

అయితే వారం ఓటింగ్ లో కూడా శుభ శ్రీ, ప్రియాంక, తేజ లీస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు లేదా ముగ్గురు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లీస్ట్ ఓటింగ్ లో ఉన్న ఈ ముగ్గురిలో శుభ శ్రీ బయట ఎక్కువగా కనిపించరు, అలాగే బిగ్ బాస్ కు ముందు ఆమె తెలిసిన వాళ్ళు చాల తక్కువ కాబట్టి ఆమెకు తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది.

సీక్రెట్ రూమ్

అమర్, గౌతమ్ ఇద్దరు సీక్రెట్ రూమ్ కు వెళ్తారు అంటూ బజ్ నడుస్తుంది. నిన్న నాగార్జున అడిగినప్పుడు ఇంట్లో ఉండటానికి ఎవరికీ అర్హత లేదు అంటే చాలా మంది అమర్, గౌతమ్ పేర్లు చెప్తారు. అందుకని వీళ్లిద్దరు సీక్రెట్ రూమ్ కు పంపి ఆటను మరింత ఆసక్తిగా చేయాలనీ చూస్తున్నారు.

ఈరోజు ఎపిసోడ్ అయితే మాములుగా లేదు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఒకేసారి 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లాన్ చేసారు. అయితే ఈ సీజన్ కేవలం 14 మంది తో స్టార్ట్ అయ్యింది. 4 హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవ్వగా 10 మంది మిగిలారు. ఇప్పుడు 7 వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో మొత్తం 16 మంది అవుతారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ vs హౌస్ మేట్స్ బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేయబోతున్నట్లు వినిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉండబోతున్నట్లు అనిపిస్తుంది.

Also Read: Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..!

Advertisment
తాజా కథనాలు