జమ్మూ కశ్మీర్‌ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!!

జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

New Update
జమ్మూ కశ్మీర్‌ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!!

Jammu Kashmir Accident: ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఊహించలేము. మరీ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు. అప్పటి వరకు తమతో ఉన్న వాళ్లు రోడ్డు ప్రమాదంలో ఎప్పుడు విగత జీవులుగా మారుతారో అసలు చెప్పలేం. తాజాగా, జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊహించని రీతిలో అతి భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది.

కిష్త్వార్ నుంచి జమ్మూ కశ్మీర్‌కు 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి 250 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం భయానకంగా మారింది. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ బస్సు ప్రమాదం.ఈ ఘటనలో 36 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మ‌తుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘోర బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాఫ్టర్ సేవలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: పాలకొల్లులో హై టెన్షన్‌..ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.!

Advertisment