/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-Kavitha-1.jpg)
ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఆమె కస్టడీనీ ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఈ రోజుతో కవిత రిమాండ్ ముగిసింది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె కస్టడీని మరో 6 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 20 వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్న జడ్జి తెలిపారు. ఇదిలా ఉంటే.. కవిత అరెస్టు అయి రేపటితో రెండు నెలలు పూర్తి కానుంది.
లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఆ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలుస్తోంది. మరో వైపు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరగనుంది. అక్కడ కూడా బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు.