Shock to CBN: చంద్రబాబుకు సీఐడీ షాక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు!

స్కిల్‌ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి(నవంబర్‌ 1) వరకు మీడియాతో మాట్లడొద్దని ఆదేశించింది. ఎలాంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తమ మెమోలో కోరడంతో హైకోర్టు ఇలా చెప్పింది.

New Update
Shock to CBN: చంద్రబాబుకు సీఐడీ షాక్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు!

టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీ స్కిల్ స్కామ్‌ కేసు నుంచి చంద్రబాబుకు కాస్త రిలీఫ్‌ వచ్చిన విషయం తెలిసిందే. మధ్యంతర బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. అయితే చంద్రబాబుకి స్కిల్ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న నిబంధనలను మరింత పెంచాలంటూ హైకోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్‌పై విడుదలవడంతో ఎలాంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని మెమోలో కోరింది సీఐడీ. దీంతో చంద్రబాబుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి(నవంబర్‌ 1) వరకూ చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హైకోర్టు తెలిపింది. ఇక కౌంటర్ దాఖలు చెయ్యాలని చంద్రబాబు లాయర్లకు సూచించింది.

52రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. జైలు నుంచి రిలీజైన చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. 52రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. జైలు నుంచి రిలీజైన చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన అరెస్ట్‌ను ఖండించిన బీఆర్ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానాన్ని తాను మరిచిపోలేనన్నారు. ప్రజల ప్రేమతో తన జీవితం ధన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కల్యాణ్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబుకు అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. 'నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులు ఎక్కడికక్కడ నా కోసం సంఘీభావం తెలియజేశారు. పూజలు చేశారు. మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడికక్కడ నేను చూసిన అభివృద్ధిని గుర్తించారు' అంటూ కామెంట్స్ చేశారు.

Also Read: కేవలం నాలుగు వారాల బెయిలుకే ఇంత బిల్డప్ ఎందుకు?

Advertisment
తాజా కథనాలు