BIG BREAKING: జగన్‌కు మరో బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎంపీ! AP: జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయంత్రంలోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 28 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి MP Mopidevi Venkataramana: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. వైసీపీ ఓటమి అనంతరం పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసిన అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. నేతల రాజీనామాలతో అయోమయంలో జగన్ కు మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. పార్టీ మారేందుకు మంత్రి అనగానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోగా ఈ అంశంపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభలో ఒక సీటు డౌన్.. సీఎం చంద్రబాబు చేరికల వ్యూహం మొదలు పెట్టారు. వైసీపీ నుంచి నేతలను టీడీపీలో చేర్చుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ మోపిదేవి వెంకటరమణను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభలో బలంగా ఉన్న వైసీపీకి సంఖ్య బలం తగ్గనుంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తే 11 నుంచి 10కి సంఖ్య బలం పడిపోనుంది. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసి వెంకటరమణ టీడీపీలో చేరితే ఎన్డీయే కూటమికి ఒక స్థానం పెరిగినట్లు అవుతోంది. #mp-mopidevi-venkataramana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి