YCP: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం

అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయనగరం నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ అవనాపు విజయ్, సీనియర్ నేత పిళ్లా విజయ్ కుమార్ వర్గం వైసీపీకి రాజీనామా చేశారు. తొలి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా తమకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

YCP: వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం
New Update

ViJayanagaram: అధికార పార్టీ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయితే, మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, విజయనగరం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్చార్జ్ అవనాపు విజయ్, నియోజకవర్గ సీనియర్ వైసీపీ నాయకుడు పిళ్లా విజయ్ కుమార్ వర్గం రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

Also Read: కడపలో ఫ్లెక్సీల రగడ.. స్టేషన్ ఎదుట జనసైనికుల ఆందోళన

గత కొంత కాలంగా విజయనగరం అసెంబ్లీ సీటును బీసీలకు కేటాయించాలని పోరాటం చేస్తున్నామని అయితే, పార్టీ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా తమకు గుర్తింపు లేదంటూ వాపోతున్నారు. పార్టీ కోసం రాత్రి, పగలు కష్టపడితే ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ జెండాను మోస్తూ ఆస్తులు పోయాయని, ఆనార్యోగం పాలైయ్యమని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ మాత్రం విలువ ఇవ్వలేదని పేర్కొన్నారు.

Also Read: RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!

వైఎస్సాఆర్ ఫ్యామిలీ పై ఉన్న అభిమానంతో పార్టీ కోసం కష్టాపడ్డామని అయితే తమను ఏ మాత్రం లెక్కచేయడం లేదని కామెంట్స్ చేశారు. విలువ లేని చోటా ఉండలేమన్నారు. పార్టీకి సంబంధించి కార్యక్రమాలకు, మీటింగులకు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై వైసీపీ పెద్దలకు చెప్పినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకే రాజీనామ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజును కలిశారు అవనాపు విజయ్. ఈ నెల 19న అవనాపు విజయ్ వర్గం టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe