YCP MLC Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు షాక్ AP: శిరోముండనం కేసులో శిక్ష నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు.. ఫిర్యాదు దారులకు కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. By V.J Reddy 23 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP MLC Thota Trimurthulu: శిరోముండనం కేసులో శిక్ష నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు.. ఫిర్యాదు దారులకు కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. ALSO READ: కవితకు ఊరట లభించేది ఎప్పుడో? అసలేం జరిగింది... ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఈరోజు విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు దళితులను హింసించి వారిలో ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటనపై 28 ఏళ్ల విచారణ తర్వాత నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమాన విధించింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 2019 వరకు 148సార్లు కేసు వాయిదా తర్వాత నిరవధికంగా విచారణ కొనసాగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాజాగా కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో న్యాయం జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #ycp-mlc-thota-trimurthulu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి