/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-2-jpg.webp)
EX Minister Bhuma Akila Priya: ఏపీలో ఎన్నికల హాడావీడి నడుస్తోంది. గెలుపు కోసం అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన హోరా హోరీగా సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు వేరే పార్టీల్లోకి మారుతున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలోకి వలసలు పెరిగాయి. దొర్నిపాడు మండలం రామచంద్రపురం సర్పంచ్ బోబూరి ఉమాదేవితో సహా 50 కుటుంబాలు వైసీపీనీ వీడీ టీడీపీలో చేరాయి.
Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..
దీంతో రామచంద్రపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. సర్పంచ్ బోబూరి ఉమాదేవితో సహా 50 కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి భూమ అఖిలప్రియ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలన నచ్చక ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చందంగా వచ్చి టీడీపీలో చేరుతున్నారన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని కామెంట్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలని కోరారు.
Also Read: మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంటే వైసీపీ హయాంలో హత్యలకు, అక్రమాలకు కేర్ అఫ్ అడ్రెస్ గా మారిందని విమర్శలు గుప్పించారు. అందరం కలిసి ఒక కుటుంబంలా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేద్దామని భూమా అఖిల ప్రియ పిలుపునిచ్చారు.