Shock To Wipro Freshers : కరోనా (Corona) తరువాత ఐటీ రంగం అల్లకల్లోలంగా తయారయ్యింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (Financial Crisis) ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలతో సహా ఎం ఎన్ సీ కంపెనీలు కూడా చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. కరోనా సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ఇప్పుడు వారందరిని తీసి పడేస్తున్నాయి. ఏవో కొన్ని కంపెనీలు మినహా మిగిలిన అన్ని చోట్లా తీవ్ర సంక్షోభం నెలకొంది.
దీంతో మరోసారి రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ విప్రో ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలో కొత్తగా తీసుకున్న వారి నియామకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫ్రెషర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.అంతకుముందు రెండున్నరేళ్ల క్రితం అంటే దాదాపు 30 నెలల క్రితం ఫ్రెషర్లకు ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్లు (ఆఫర్ లెటర్స్) ఇప్పుడు రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
విప్రో.. ఎన్నో ఏళ్లుగా ఎవరిని నియమించడం లేదు.. కార్యాలయాలకు పిలవడం లేదు.. జీతాలు ఇవ్వడం లేదు. తీసుకుంటాం అంటూ గడువు పొడిగిస్తూనే ఉన్న విప్రో (Wipro).. ఇప్పుడు చేతులెత్తేసింది. దాదాపు 30 నెలల ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విప్రో తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. అపాయింట్‌మెంట్ల రద్దు మాత్రమే కాదు.. విప్రో చెప్పిన కారణం.. వారి ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది.
Also Read: నా మాటలు వక్రీకరించారు…సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్!