MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈడీ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 6న తీర్పు వెలువరించనుంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
New Update

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈడీ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మే 6న తీర్పు వెలువరించనుంది. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. సీబీఐ కేసులో మే 2న కోర్టు తీర్పును వెల్లడించనుంది. రెండు కేసుల్లో కోర్టు తీర్పు ఏంటన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఏ ఒక్క కేసులో బెయిల్‌ రాకపోయినా మరికొన్ని రోజులు ఎమ్మెల్సీ కవిత జైల్లోనే ఉండనున్నారు.

ALSO READ: ఓవైసీ గోవులను కోసి తినమంటాడు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈడీ వాదనలు ఇలా..

* మనీ లాండరింగ్‌ కేసులో అనేక మంది నిందితులకు బెయిల్‌ రాలేదు
* మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయి
* తప్పు జరిగినట్లుగా సుప్రీం కోర్టు నిర్ధరించింది
* మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్‌ను కలిశారు
* కవితను కలవమని కేజ్రీవాల్‌ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెప్పారు
* శ్రీనివాసులు రెడ్డి కవితను హైదరాబాద్‌లో కలిశారు
* కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసులు రెడ్డికి చెప్పారు
* రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసులు రెడ్డిని కోరారు
* అభిషేక్‌, బుచ్చిబాబుకు రాఘవ రూ. 25 కోట్లు ఇచ్చారు
* ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్‌లో కవిత భాగస్వామ్యం పొందారు
* వ్యపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పనిచేశారు
* బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సప్‌ చాట్స్‌లో ఆధారాలున్నాయి

#mlc-kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe