YS Jagan: ఏపీలో చంద్రబాబు సర్కార్ జగన్ కు మరో బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా, మాజీ సీఎం సొంత జిల్లా కడప వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని బిల్డింగ్ పిల్లర్‌కు నోటీసులు అంటించారు. కడప-చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేశారు. రెండెకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి రూ.3 వేలు చొప్పున 33 ఏళ్లకు లీజ్ తీసుకున్నారు.
Also Read: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్..!
రూ.కోట్ల విలువ చేసే భూమిని లీజుకు తీసుకున్న వైసీపీ..నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్లాన్ అప్రూవల్ కూడా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని వైసీపీ కార్యాలయాలకు టీడీపీ ప్రభుత్వం నోటీసులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో వైసీపీ కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని అధికారులును ఆదేశించారు.