Janasena: జనసేన పార్టీకి బిగ్ షాక్..!

గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.

New Update
Janasena: జనసేన పార్టీకి బిగ్ షాక్..!

Janasena : గుడివాడ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యువనేత డాక్టర్ మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య యువకుడుగా ఉన్న తాను ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా పనిచేసినట్లు తెలిపారు. పార్టీ విలీనం కావడంతో అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉండి సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారని అన్నారు. అయితే, పవన్ పిలుపుతో తిరిగి జనసేన పార్టీలో చేరానని వ్యాఖ్యనించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నేను చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.

పదేళ్లుగా పవన్ పేరు జపిస్తు జనసేన జెండా భుజాలపై మోస్తూ..యువతతో కలిసి పార్టీ పేరు మీద వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కరోనా సమయంలో అనాధ శవాలకు అంత్యక్రియలతో మొదలు.. నిత్యం రోడ్లపై ఉండి ప్రజాసేవలో సైనికుల మాదిరి గర్వంగా భాగస్వామ్యం అయ్యామని అన్నారు. మాచర్ల రామకృష్ణ కంటే కూడా.. జనసేన ఆర్కే అంటేనే తాను అందరికీ తెలుసన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలను మెచ్చి డాక్టరేట్ ఇచ్చారని.. ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా అవార్డుతో సత్కరించినట్లు తెలిపారు.

Also Read: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్‌ కళ్యాణ్‌

అయితే, పలు పార్టీల నాయకులు, గుడివాడ ప్రముఖులు తన సేవలను ప్రోత్సహిస్తున్న.. గుడివాడ, కృష్ణా జిల్లా జనసేన నేతలు మాత్రం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టించి పనిచేసే సామాన్య కార్యకర్తలు ఎంతో నష్టపోతున్నారని.. గుడివాడలో జనసేన నేతలు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నేతల వ్యవహార శైలి నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

గుడివాడలో జనసేన కార్యకర్త కావడమే తాము చేసుకున్నా దౌర్భాగ్యమా అంటూ వాపోయారు జనసేన యువనేతలు అయ్యప్ప, చరణ్. పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారు తప్పా కార్యకర్తలను పట్టించుకునే వారెవరు లేరని మండిపడ్డారు. జిల్లా నాయకత్వం కనీసం కమిటీలు కూడా వేయలేదని ధ్వజమెత్తారు.

Advertisment
తాజా కథనాలు