Maharashtra : మహారాష్ట్రలోని అమరావతి(Amaravati) కి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్(Navaneet Kaur) కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court) పెద్ద ఊరటనిచ్చింది. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు(Bombay High Court) రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సంక్షోభం నెలకొంది. ఎంపీ నవనీత్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నవనీత్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
నవనీత్ రాణా పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అంతకుముందు తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్వతంత్ర ఎంపీ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.
బాంబే హైకోర్టు జూన్ 8, 2021న నకిలీ పత్రాలను ఉపయోగించి మోచి కుల ధృవీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆమె సిక్కు-చామర్ కులానికి చెందినదిగా రికార్డులు చూపిస్తున్నాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు ఆమెకి రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. ఇప్పుడు హైకోర్టు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు తిరస్కరించడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు అడ్డంకి గా మారింది. హైకోర్టు తన తీర్పులో చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నవనీత్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
Also Read : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి..