Jayaprada: నటి జయప్రదకు బిగ్ రిలీఫ్.. తప్పిన జైలు శిక్ష..!

నటి జయప్రదకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈఎస్ఐసీ కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆరు నెలల జైలు శిక్ష తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీమా సొమ్ము ఎగవేతకు పాల్పడినట్టు థియేటర్ కార్మికులు ఆమెపై ఎగ్మోర్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

New Update
Jayaprada: నటి జయప్రదకు బిగ్ రిలీఫ్.. తప్పిన జైలు శిక్ష..!

Actress Jayaprada: నటి జయప్రద 1976లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలలో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి ఎంపీ పదవిని పొందిన సంగతి తెలిసిందే.

publive-image

పాలిటిక్స్ లో ఉంటూనే పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, జయప్రద ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్) కేసు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బిగ్ రిలీఫ్ అభించింది.

Also Read: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..!

publive-image

వివరాల్లోకి వెళితే.. ఈఎస్ఐసీ కేసులో నటి జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఎగ్మూర్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మద్రాసు కోర్టులో జయప్రద అప్పీలు దాఖలు చేసింది. అయితే, అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్మోర్ కోర్టు తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు జయప్రద శిక్షకు అర్హురాలని పేర్కొంది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే సినిమా గ్లింప్స్ రిలీజ్..!

publive-image

జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించింది. మద్రాసు కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో నటి జయప్రద ఊపిరి పీల్చుకున్నారు. థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్‌ఐసీ కింద చెల్లించాల్సిన రూ.8,17,794 విషయంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని థియేటర్ కార్మికులు ఆమెపై ఫిర్యాదు చేశారు. నటి జయప్రద తోపాటు ఆమె సోదరుడు రాజబాబు, వ్యాపార భాగస్వామి రామ్‌కుమార్‌లపై కేసు నమోదైంది.

Advertisment
తాజా కథనాలు