BIG C దసరా దమాకా ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్, టీవీలు, ల్యాప్ టాప్ లు, ఏసీలపై ఊహించని ఆఫర్లు

సరా పండుగ సందర్భంగా ఎన్నో ఆఫర్లతో వచ్చేసింది. దసరా పండుగను పురస్కరించుకోని వినియోగదారుల కోసం ధమాకా ఆఫర్లను తీసుకువచ్చినట్లు బిగ్‌ సి వ్యవస్థాపకుడు సీఎండీ బాలు చౌదరి తెలిపారు.

New Update
BIG C దసరా దమాకా ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్, టీవీలు, ల్యాప్ టాప్ లు, ఏసీలపై ఊహించని ఆఫర్లు

BIG C Dussehra Offers: దసరా పండుగ వచ్చిందంటే..ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఫెస్టివల్‌ ఆఫర్లను ప్రకటించి వినియోగదారులను తమ వైపునకు తిప్పుకుంటుంది. దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలు అయిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon) రెండు బిగ్‌ బిలియన్‌ డేస్‌, గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్స్ అంటూ భారీ తగ్గింపు ధరలను ప్రజల ముందుకు తీసుకుని వచ్చాయి.

ఈ దోవలోకే ప్రముఖ మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ బిగ్‌ సి (Big C) కూడా వచ్చి చేరింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆఫర్లతో వచ్చేసింది. దసరా పండుగను పురస్కరించుకోని వినియోగదారుల కోసం ధమాకా ఆఫర్లను తీసుకువచ్చినట్లు బిగ్‌ సి వ్యవస్థాపకుడు సీఎండీ బాలు చౌదరి తెలిపారు.

Also read: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

ధమాకా ఆఫర్స్‌ లో భాగంగా ఏ స్మార్ట్‌ ఫోన్ కొనుగోలు చేసినా దాని మీద రూ.10 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ తో పాటు రూ.4 వేలు విలువ చేసే బహుమతిని కూడా అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా ఫోన్లను కొంటే రూ.9 వేలు క్యాష్‌ బ్యాక్‌, ఎస్‌బీఐ కార్డు ద్వారా మొబైల్‌, స్మార్ట్‌ టీవీ, ల్యాప్‌ టాప్‌ లు కొనుగోలు చేస్తే రూ. 3 వేల వరకు ఇన్‌ స్టంట్ డిస్కౌంట్‌, ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ను అందించనున్నట్లు పేర్కొన్నారు.

కొన్ని సెలెక్టెడ్‌ ఫోన్లు కొనుగోలు పై రూ.5 వేలు బోల్డ్‌ స్మార్ట్ వాచీని రూ.299 కే ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఐఫోన్‌ కొనుగోలు రూ. 4 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ని ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాకుండా వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా మొబైల్‌, స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, ఏసీలను కొనుగోలు చేసే సదుపాయం కూడా ఉందని బాలు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు